స్వాగ్ ఆఫ్ అర్జున్
యువసామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. మీనాక్షి చౌదరి కథానాయిక.
యువసామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. మీనాక్షి చౌదరి కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్.బి నిర్మిస్తున్న ఈచిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. తాజాగా ఈసినిమా మ్యూజికల్ జర్నీని మేకర్స్ మొదలుపెట్టారు. తొలిపాట ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ని ఈ నెల 7న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నది.
సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్ గాగు ల్స్, ఇయర్ ఫోన్స్‌తో, ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్న నాగచైతన్యను ఈ పోస్టర్లో చూడొచ్చు. అతని భుజంపై గాయం, డార్క్ బ్యాక్‌డ్రాప్.. ఈ పోస్టర్‌కి రఫ్ అండ్ రగ్గడ్ అప్పీల్‌ని తెచ్చాయి. నాగచైతన్య పోషిస్తున్న అర్జున్ పాత్రలో స్వాగ్, ఆటిట్యూడ్‌ని ప్రతిబింబించేలా ఈ పోస్టర్ని డిజైన్ చేశారు. స్పర్శ్ శ్రీవాస్తవ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈచిత్రానికి కెమెరా: రగుల్ డి.హెరియన్, సంగీతం: అజనీష్ బి.లోక్‌నాథ్, సమర్పణ: బాపినీడు, నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర, సుకుమార్ రైటింగ్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

