సీనియర్ నటుడు వీకే నరేష్ ఈ ఏడాదితో 50 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద పాల్గొన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో జాకీష్రాఫ్, పూనమ్ థిల్లాన్, జయసుధ, సుహాసిని, ఖుష్భూ, సాయిదుర్గాతేజ్, మనోజ్ మంచు, నారా రోహిత్, దర్శకుడు మారుతి, అనుదీప్, అలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయకృష్ణ మందిర్, ఘట్టమనేని ఇందిరాదేవి స్ఫూర్తివనాన్ని వీకే నరేష్ ప్రారంభించారు. భావితరం ఫిల్మ్‌మేకర్స్‌కు ఇది తన కానుకని వీకే నరేష్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ స్ఫూర్తివనంలో భవిష్యత్తులో ఫిల్మ్ లైబ్రరీ, మ్యూజియంను ఏర్పాటు చేయబోతున్నారు.