Vishwaksen | ఫలక్‌నుమా దాస్ సినిమాతో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు విశ్వక్సేన్ ( Vishwaksen). ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సూపర్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. మాస్ కా దాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వరుణ్‌తేజ్ వెడ్డింగ్ సెర్మనీ తర్వాత ఇండియాలో ల్యాండ్ అయ్యాడు రాంచరణ్ (Ram Charan). గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ త్వరలోనే షురూ కానుండగా.. రాంచరణ్ జాయిన్ కానున్నాడు. తాజాగా రాంచరణ్, విశ్వక్సేన్ ఒక్క చోట సందడి చేసిన స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
రాంచరణ్, విశ్వక్సేన్ సరదాగా చిల్ అవుట్ అవుతున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ ఇద్దరి కలయిక వెనుక ఏదైనా సీక్రెట్ ఉందా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. రాంచరణ్ ప్రస్తుతం టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్ (Game changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ Jaragandi పాటను దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. గేమ్ ఛేంజర్ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ Saregama దక్కించుకుంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. రాజోలు భామ అంజలి, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌కు పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
విశ్వక్సేన్ నటిస్తోన్న ప్రాజెక్టుల్లో ఒకటి విశ్వక్ సేన్ 10 (VS 10). డెబ్యూ డైరెక్టర్ రవితేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. విశ్వక్ సేన్ 11 గా తెరకెక్కుతున్న మరో చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari)లో నటిస్తున్నాడు. ఈ మూవీకి ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి , అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. రీసెంట్గా విడుదల చేసిన గ్లింప్స్ వీడియోతో ఈ సినిమాను డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలియజేశారు మేకర్స్.
Hero @VishwakSenActor with Mega Powerstar @AlwaysRamCharan #Ramcharan #VishwakSen pic.twitter.com/mKZhW1O6Ow
— Suresh PRO (@SureshPRO_) November 7, 2023
చాందినీ చౌదరి గామి అప్డేట్..
Gaami is finally a wrap! Can’t wait for the world to witness this fantastic film we made 🔥 pic.twitter.com/a9v7E6SytL
— Chandini Chowdary (@iChandiniC) May 1, 2023
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్..
విశ్వక్సేన్, నేహాశెట్టి డ్యాన్స్..
Get ready for a musical extravaganza 💥
✨Super excited to associate with Mega Powerstar @AlwaysRamCharan & @shankarshanmugh’s #GameChanger 🔥
Brace yourselves for the sensational soundtrack #Jaragandi coming out this Diwali! 🤩
A @MusicThaman musical@advani_kiara… pic.twitter.com/bLCi3kDcOL
— Saregama South (@saregamasouth) November 7, 2023
Get ready for a musical explosion 💥 @saregamaglobal has secured the audio rights of Mega Powerstar @AlwaysRamCharan & @shankarshanmugh’s #GameChanger 🔥
Brace yourselves for the sensational soundtrack #Jaragandi coming out this Diwali! 🤩
A @MusicThaman musical… pic.twitter.com/MO40I7Q0MD
— Sri Venkateswara Creations (@SVC_official) November 7, 2023
గేమ్ ఛేంజర్ ఫస్ట్ సాంగ్ లోడింగ్..
#RamCharan #Gamechanger first single on Dussehra
update soon !
— Rajesh Manne (@rajeshmanne1) October 17, 2023