Legacy Movie | వారసత్వ యుద్ధానికి సిద్ధమైన ‘విశ్వక్ సేన్’.. ఆకట్టుకుంటున్న ‘లెగసీ’ టీజర్!
Legacy Teaser | టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరో విలక్షణమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Legacy Teaser | టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరో విలక్షణమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘లెగసీ’. ప్యూర్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. “పాలిటిక్స్ ఈజ్ పర్సనల్” అనే పవర్ఫుల్ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. టీజర్ ప్రారంభం నుండి ముగింపు వరకు చాలా ఇంటెన్స్‌గా సాగింది. ముఖ్యంగా విశ్వక్ సేన్ చెప్పిన డైలాగులు పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నాయి:
“రాజకీయమంటే పులిమీద సవారీ లాంటిదంటారు.. ఆ పులి మీద నాయకుడు ఒక్కడే కూర్చోవాలా? ఆ కుటుంబం మొత్తం కూర్చోవాలా?” “దిస్ ఈజ్ యాన్ ఇంటర్నల్ వార్ ఫర్ రియల్ లెగసీ” ఈ డైలాగ్స్ చూస్తుంటే, అధికారం కోసం ఒకే కుటుంబంలో జరిగే అంతర్గత పోరు, వారసత్వ రాజకీయాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని స్పష్టమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విశ్వక్ సేన్ ఈ సినిమాలో ఒక సీరియస్ పొలిటీషియన్ పాత్రలో కనిపిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి సాయికిరణ్ రెడ్డి దైడా దర్శకత్వం వహిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాలో ఏక్తా రాథోడ్ హీరోయిన్గా నటిస్తుండగా.. రావు రమేశ్, సచిన్ ఖేడ్కర్, మురళీ మోహన్, కేకే మేనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కలాహి మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమటి, సాయికిరణ్ రెడ్డి దైడా నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krishna Burugula | సినిమాల సంఖ్య కంటే ప్రేక్షకుల గుండెల్లో స్థానమే ముఖ్యం : ‘జిగ్రీస్’ హీరో కృష్ణ బూరుగుల!
CM Revant vs Farmers | సీఎం రేవంత్‌రెడ్డి అహంకారంపై పాడి రైతుల ఆగ్రహం.. Video
Pankaja | ఆస్కార్ బరిలో తెలుగమ్మాయిల సత్తా.. అకాడమీ రేసులోకి ‘పంకజ’ షార్ట్‌ఫిలిం!
Sudigali Sudheer | సుడిగాలి సుధీర్‌పై ‘గోట్’ నిర్మాత సంచలన ఆరోపణలు.. చివరి 30 శాతం షూటింగ్‌కు రాలేదంటూ కామెంట్
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

