Krishna Burugula | సినిమాల సంఖ్య కంటే ప్రేక్షకుల గుండెల్లో స్థానమే ముఖ్యం : ‘జిగ్రీస్’ హీరో కృష్ణ బూరుగుల!
Krishna Burugula | తెలుగు చిత్ర పరిశ్రమలో ఏమాత్రం బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి, కేవలం తమ సహజమైన ప్రతిభతోనే ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్న యువ నటుల జాబితాలో కృష్ణ బూరుగుల పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఏమాత్రం బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి, కేవలం తమ సహజమైన ప్రతిభతోనే ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్న యువ నటుల జాబితాలో కృష్ణ బూరుగుల పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. సినిమాల సంఖ్యను పెంచుకోవడం కంటే, చేసిన ప్రతి పాత్ర ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆయన బలంగా నమ్ముతున్నారు. “పరిగెత్తి పది సినిమాలు చేసే బదులు.. నిలబడి నాలుగు మంచి సినిమాలు చేయడం ఉత్తమం” అనే సిద్ధాంతంతో ఆయన తన కెరీర్‌ను అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దుకుంటున్నారు.
కృష్ణ బూరుగుల సినీ ప్రయాణాన్ని పరిశీలిస్తే, ‘జిగ్రీస్’ చిత్రానికి ముందు ‘క్రష్’, ‘మా నాన్న నక్సలైట్’, ‘ఏటీఎం’ వెబ్ సిరీస్, ‘కృష్ణమ్మ’ వంటి రెండు మూడు విభిన్న ప్రాజెక్టులలో నటించి నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల తెరకెక్కించిన ‘జిగ్రీస్’ సినిమా విడుదలైన తర్వాతే ఆయన కెరీర్ మలుపు తిరిగి, అసలైన స్టార్డమ్, విస్తృతమైన గుర్తింపు లభించాయి. ఆ చిత్రంలో కార్తీక్ అనే పాత్రలో పక్కింటి కుర్రాడిలా ఎంతో సహజంగా ఒదిగిపోయి, తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో, ఎమోషనల్ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేశారు. ఒక్క సినిమాతో యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలను, ప్రతిష్టాత్మక తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘ఉత్తమ హాస్యనటుడి’ పురస్కారాన్ని సైతం తన ఖాతాలో వేసుకుని సత్తా చాటారు.
‘జిగ్రీస్’ సాధించిన ఘనవిజయం తర్వాత కృష్ణ బూరుగుల వద్దకు వరుసగా సినీ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ, సక్సెస్ వచ్చింది కదా అని కంగారుపడి దొరికిన ప్రతి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఆయన ఎంతో పరిణతితో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. “ఆకలిగా ఉన్నా సరే.. తొందరపడకూడదు” (Hungry, but not in a hurry) అనే సూత్రాన్ని తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారు. కేవలం సంఖ్య కోసం పది రొటీన్ సినిమాలు చేసి కనుమరుగైపోయే కంటే, నిలబడి నాలుగు సినిమాలు చేసినా కాలర్ ఎగరేసి చెప్పుకునేలా, ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉండాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు.
తెలుగు తెరపై తమదైన శైలిలో కథలను ఎంచుకుంటూ స్టార్లుగా ఎదిగిన నేచురల్ స్టార్ నాని, నవీన్ పోలిశెట్టిల బాటలో కృష్ణ బూరుగుల ప్రయాణిస్తున్నారు. కేవలం హీరోగా కనిపించడం కాకుండా, కథకు బలం చేకూర్చే, తన పాత్రకు తగిన ప్రాధాన్యత ఉన్న చిత్రాలను మాత్రమే ఎంచుకుంటూ పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు. తెరపై నటించడం కంటే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి జీవించడానికే ఎక్కువ ఇష్టపడే కృష్ణ, తన రాబోయే సినిమాల విషయంలోనూ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం కృష్ణ బూరుగుల లైనప్ ఎంతో ఆసక్తికరంగా రూపుదిద్దుకుంటోంది. ఒక వినూత్నమైన కథాంశంతో (యూనిక్ స్టోరీ పాయింట్), కుటుంబమంతా కలిసి కడుపుబ్బా నవ్వుకునే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్తో త్వరలోనే ఒక క్రేజీ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన రాబోతోంది. ఈ చిత్రంతో పాటు మరో రెండు మూడు ఆసక్తికరమైన కథలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. బలమైన కథలు తోడైతే, తన సహజసిద్ధమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మరోసారి అలరించి, టాలీవుడ్లో మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు చిత్రసీమకు దొరికిన ఈ అద్భుతమైన నేచురల్ టాలెంట్, తన క్వాలిటీ సినిమాలతో మరిన్ని ఘనవిజయాలు అందుకోవాలని ఆశిస్తూ.. ‘జిగ్రీ’ కృష్ణ బూరుగులకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krishna Burugula | సినిమాల సంఖ్య కంటే ప్రేక్షకుల గుండెల్లో స్థానమే ముఖ్యం : ‘జిగ్రీస్’ హీరో కృష్ణ బూరుగుల!
CM Revant vs Farmers | సీఎం రేవంత్‌రెడ్డి అహంకారంపై పాడి రైతుల ఆగ్రహం.. Video
Pankaja | ఆస్కార్ బరిలో తెలుగమ్మాయిల సత్తా.. అకాడమీ రేసులోకి ‘పంకజ’ షార్ట్‌ఫిలిం!
Sudigali Sudheer | సుడిగాలి సుధీర్‌పై ‘గోట్’ నిర్మాత సంచలన ఆరోపణలు.. చివరి 30 శాతం షూటింగ్‌కు రాలేదంటూ కామెంట్
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

