Vishwak Sen | సారీ ఈవెంట్ రద్దయింది..త్వరలో కలుద్దామన్న విశ్వక్ సేన్
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న అశోక వనంలో అర్జున కల్యాణం (Ashoka Vanamlo Arjuna Kalyanam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విశ్వక్ సేన్ . మే 6న థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ప్లాన్ రెడీ చేసుకున్నాడు విశ్వక్ సేన్.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) త్వరలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న అశోక వనంలో అర్జున కల్యాణం (Ashoka Vanamlo Arjuna Kalyanam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. రుక్షర్ ధిల్లాన్ (Rukshar Dhillon) హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రానికి విద్యాసాగర్ చింతా (Vidya Sagar Chinta) డైరెక్టర్. కాగా మే 6న థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ప్లాన్ రెడీ చేసుకున్నాడు విశ్వక్ సేన్.
అందులో భాగంగానే నేడు సాయంత్రం హైదరాబాద్‌లో ఏఎంబీ సినిమాస్‌లో ఫ్యాన్స్ తో సమావేశం ఏర్పాటు చేశాడు. అయితే మూవీ లవర్స్ కోసం రెడీ చేసిన ఈవెంట్ అనుకోకుండా రద్దైంది. ఈ విషయాన్ని విశ్వక్ సేన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. క్షమించండి..సాయంత్రం కార్యక్రమం అనుకోని కారణాలతో రద్దయింది..త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తాం..అని సందేశాన్నిపెట్టాడు విశ్వక్ సేన్. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జే క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్.
Read Also : Ravanasura | ‘రావణాసుర’పై క్రేజీ అప్ డేట్ వచ్చేసింది..
సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేసుకునే యువకుడికి గోదావరి జిల్లాల నుంచి సంబంధం కలుపుకోవడానికి వెళ్తారు. ఆ తర్వాత సంబంధం కుదిరినట్టే కుదిరి..రద్దవుతుంది. ఆ తర్వాత ఆ యువకుడి జీవితంలో ఎలాంటి మలుపులు తిరిగిందనే కథాంశంతో ఈ మూవీ రాబోతున్నట్టు ట్రైలర్ తో చెప్పేశాడు డైరెక్టర్.
Read Also : SS Rajamouli | కారు కొనుక్కున్న జక్కన్న..ఇంతకీ ఖరీదెంతో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

