Rajinikanth | విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘లాల్ సలాం’. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ మెయిద్దీన్ భాయ్‌గా పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను ఇటీవల పూర్తిచేశారు. ఈ న్యూస్‌ను దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ తన సోషల్‌మీడియా ద్వారా తెలియజేశారు.
“మీతో సినిమా చేయడం ఓ అద్భుతం.. నాన్నా.. మీరు ఎప్పుడూ నటనతో మ్యాజిక్ చేస్తుంటారు. ‘లాల్ సలాం’లో మెయిద్దీన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి’ అని ఆమె పేర్కొన్నారు. రజనీకాంత్ సహా ఎంటర్టైనర్ యూనిట్ కలిపి దిగిన ఫొటోను ఆమె ఈ సందర్భంగా షేర్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సమర్పణ: సుభాస్కరన్.