Makutam | అంజలికి కథ చెప్పేందుకు వెళ్లిన విశాల్.. ‘మకుటం’ కాన్సెప్ట్ వీడియో వైరల్
Makutam | డైరెక్టర్ అయిన విశాల్ అంజలి దగ్గరకి కథ చెప్పేందుకు వెళ్తాడు. ఇక కథ చెప్పండి డైరెక్టర్ గారు అని అంజలి అంటారు. ఒక అందమైన గ్రామం అని విశాల్ మొదలు పెట్టగానే.. అది ప్రొడక్షన్ వాళ్లు చూసుకుంటారు కదా.. ముందు మీరు కథ చెప్పండి అంటూ కౌంటర్ వేస్తుంది అంజలి.
Makutam | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ విశాల్. ఈ టాలెంటెడ్ యాక్టర్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మకుటం’. ప్రతిష్టాత్మక సూపర్‌గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంస్థ నుంచి వస్తున్న 99వ సినిమా కావడం విశేషం. ఈ మూవీలో దుషార విజయన్, అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. తంబి రామయ్య, ఐర్జె తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా అంజలి, విశాల్ ఓ కాన్సెప్ట్ వీడియోతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. డైరెక్టర్ అయిన విశాల్ అంజలి దగ్గరకి కథ చెప్పేందుకు వెళ్తాడు. ఇక కథ చెప్పండి డైరెక్టర్ గారు అని అంజలి అంటారు. ఒక అందమైన గ్రామం అని విశాల్ మొదలు పెట్టగానే.. అది ప్రొడక్షన్ వాళ్లు చూసుకుంటారు కదా.. ముందు మీరు కథ చెప్పండి అంటూ కౌంటర్ వేస్తుంది అంజలి. విశాల్ కథ చెబుతూ ఉంటే మధ్యమధ్యలో సైటైర్స్ వేస్తూ.. మేనేజర్ మంచి కథ అని చెప్పారే.. అసలు మీ వద్ద కథ ఉందా..? అని అడగడంతో విశాల్ పారిపోతాడు. రేపు వచ్చి మరో కథ చెబుదామని వెళ్లిపోయే కాన్సెప్ట్ వీడియో ఆసక్తికరంగా సాగుతూ మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచుతోంది.
మకుటం చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. విశాల్ దర్శకత్వ బాధ్యతలతోపాటు స్క్రీన్‌ప్లే కూడా చూసుకోనున్నాడు. విశాల్, అంజలి కాంబినేషన్‌కు సూపర్ క్రేజ్ ఉంటుందని తెలిసిందే. మరి ఈ ఇద్దరు ఎలాంటి స్టోరీతో రాబోతున్నారన్నది చూడాలి. ఇందులో నెవ్వర్ బిఫోర్ నెవ్వర్ ఆఫ్టర్ అనేలా క్లైమాక్స్ ఉండబోతుందని.. ఓవైపు దర్శకునిగా, మరోవైపు నటుడిగా విశాల్ విశ్వరూపం చూపించడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు.
A Hilarious Announcement@yoursanjali Comes On Board For #Makutam & @VishalKOfficial ’s Narrative Generates Laughs#MAGUDAM #Vishal35 #SGF99 @officialdushara @iyogibabu @dir_raviarasu @SuperGoodFilms_ #SampathRaj @Richardmnathan @srikanth_nb @g_durairaj @dhilipaction… pic.twitter.com/BSrh7nm50E
— SR PROMOTIONS (@SRPROMOTIONS29) April 25, 2026
Read Also :
Rhea Chakraborty | రియా చక్రవర్తికి భారీ ఊరట.. ఆరేళ్ల తర్వాత బ్యాంక్ ఖాతాల పునరుద్ధరణకు కోర్టు ఆదేశం!
Michael Movie | ‘మైఖేల్’ సినిమా విమర్శకులపై ఫరా ఖాన్ ఫైర్.. జాఫర్ జాక్సన్‌కు ‘ఆస్కార్’ ఇవ్వాల్సిందేనని డిమాండ్!
Suryapeta | హుజురాబాద్‌లో బాలుడు అనుమానస్పదస్థితిలో మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

