మిత్రశర్మ, గీతానంద్, శ్రీహాన్, జన్నీఫర్ ఇమ్మాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘వర్జిన్ బాయ్స్’. దయానంద్ గడ్డం దర్శకుడు. రాజా దారపునేని నిర్మాత. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. అలాగే ఈ సినిమా టికెట్ కొన్న 11మందికి ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇస్తామని ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్రబృందం ప్రకటించింది.
ఈ కథకు కచ్చితంగా సరిపోయే టైటిల్ ‘వర్జిన్ బాయ్స్’ అని, ఈ సినిమాలో ఎన్నో సర్ప్రైజులు ఉన్నాయని నిర్మాత రాజా దారపునేని తెలిపారు. తమ కాలేజ్ లైఫ్‌లో ఎదురైన కొన్ని సంఘటల ఆధారంగా ఈ కథ తయారు చేశామని, ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయని దర్శకుడు తెలిపారు. సుజిత్ కుమార్, బబ్లు, అభిలాష్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: వెంకటప్రసాద్, సంగీతం: స్మరణ్‌సాయి, నిర్మాణం: రాజ్‌గురు ఫిల్మ్స్.