నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల (Venu Udugula) డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం విరాటపర్వం (Virataparvam). రానా (Rana Daggubati), సాయిపల్లవి (Sai Pallavi) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం విడుదలపై చాలా రోజులుగా సస్పెన్స్ నెలకొంది. థియేటర్లలో విడుదల చేస్తారా..? లేదంటే ఓటీటీలో వస్తుందా..? అంటూ తెగ చర్చలు కొనసాగాయి. వాటిన్నింటికి తెరదించుతూ విరాటపర్వం విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
జులై 1న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తెలుగు నేల నడిచిన కొత్త దారుల నెత్తుటి జ్ఞాపకం..మనలోంచి మన కోసం సాగిన ఓ చారిత్రక సందర్బం..ప్రేమ యుద్ధమై సాగిన విరాటపర్వం… జులై ఒకటవ తేదీన మీ ముందుకు..అని ట్వీట్ చేశాడు వేణు ఊడుగుల. రిలీజ్ డేట్ను ప్రకటిస్తూ విడుదల చేసిన కొత్త పోస్టర్లో రానా గళ్ల చొక్కాలో ఉండగా, సాయిపల్లవి పంజాబీ డ్రెస్లో కనిపిస్తోంది.
ఈ ఇద్దరు ఛేజింగ్ సీన్లో ఉన్నట్టు అర్థమవుతుంది. నివేదా పేతురాజ్, ప్రియమణి, నవీన్చంద్ర, సాయిచంద్, జరీనా వహబ్, ఈశ్వరీరావు, నందితా దాస్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్.
తెలుగు నేల నడిచిన కొత్త దారుల నెత్తుటి జ్ఞాపకం
మనలోంచి మన కోసం సాగిన ఓ చారిత్రక సందర్బం .
ప్రేమ యుద్ధమై సాగిన విరాటపర్వం . జులై ఒకటవ తేదీన మీ ముందుకు …. @RanaDaggubati @Sai_Pallavi92 @venuudugulafilm #SureshBobbili @dancinemaniac @laharimusic @SureshProdns @SLVCinemasOffl pic.twitter.com/Gy1OlGmL3y— v e n u u d u g u l a (@venuudugulafilm) May 6, 2022