Vikram Gokhale | బాలీవుడ్ సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే తీవ్ర అనారోగ్యంతో పూణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని.. వైద్యులు వెంటిలేర్పై చికిత్స అందిస్తున్నారని గోఖలే కుటుంబ సభ్యులు గురువారం వెల్లడించారు. కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు.
‘గోఖలే నెమ్మదిగా చికిత్సకు స్పందిస్తున్నారు. ప్రస్తుతం కళ్లు కూడా తెరిచారు. శరీర భాగాలను కదుపుతున్నారు. 48 గంటల అనంతరం వెంటిలేటర్ సపోర్ట్ తీసేశే అవకాశం ఉంది’ అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే, ఆయన ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారన్న విషయాన్ని కుటుంబ సభ్యులు కానీ, ఆసుపత్రి వర్గాలు కానీ వెల్లడించలేదు.