Vikram Gokhale | బాలీవుడ్ సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే బుధవారం సాయంత్రం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో బాలీవుడ్ స్టార్ నటులు అజయ్ దేవ్‌గణ్, రితేష్ దేశ్‌ముఖ్, జావెద్ జాఫర్ తదితరులు ట్విట్టర్ ద్వారా సంతాపం కూడా తెలియజేశారు. అయితే ఈ వార్తలపై తాజాగా గోఖలే కుటుంబం స్పందించింది. గోఖలే బతికే ఉన్నారని ఆయన కుమార్తె తెలిపారు. కాకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని చెప్పారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోఖలే పూణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటన్నారు. అయితే, ఆయన ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారన్న విషయాన్ని కుటుంబ సభ్యులు కానీ, ఆసుపత్రి వర్గాలు కానీ వెల్లడించలేదు.