Vidudhala Part 2 | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న లీడింగ్ దర్శకుల్లో టాప్ ప్లేస్‌లో ఉంటాడు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetri Maaran). ఈ టాలెంటెడ్ డైరెక్టర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా విడుతలై పార్ట్ 2 టీం శుభాకాంక్షలు తెలియజేసింది. టీం తరపున వెట్రిమారన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు విజయ్ సేతుపతి (VijaySethupathi). ఇప్పుడీ ట్వీట్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
వెట్రిమారన్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు అమాంతం పెరిగిపోతుంటాయి. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన విడుతలై పార్ట్-1 (తెలుగులో విడుదల పార్ట్ 1) ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చి.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ విడుతలై పార్ట్ 2 (Vidudhala Part 2)ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు వెట్రిమారన్. ఈ సినిమాతో కమెడియన్ సూరి హీరోగా ఎంట్రీ ఇచ్చాడని తెలిసిందే. ఎంట్రీతోనే హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు.
విడుతలై పార్ట్-1లో విజయ్ సేతుపతి పెరుమాళ్ వాథియార్ పాత్రలో నటించాడు. గిరిజనులకు అండగా నిలిచే పెరుమాళ్‌గా కీ రోల్లో మెరిశాడు. సీక్వెల్లో కూడా విజయ్ సేతుపతి పాత్ర కొనసాగనుండగా.. ఇందులో మక్కల్ సెల్వన్‌కు జోడీగా మంజు వారియర్ (Manju Warrier) మెరుబోతుందని సమాచారం. అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీసులకు మధ్య నడిచే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Team #ViduthalaiPart2 wishing #VetriMaaran sir a very happy birthday 🎂 #HBDVetriMaaran
An @ilaiyaraaja Musical@sooriofficial @elredkumar @rsinfotainment @BhavaniSre @Chetan_k_a @VelrajR @DirRajivMenon @menongautham @jacki_art @GrassRootFilmCo @RedGiantMovies_ @mani_rsinfo… pic.twitter.com/iJm1AKT2ma
— VijaySethupathi (@VijaySethuOffl) September 4, 2023
Vidudhala
విడుదల పార్ట్ 1 ట్రైలర్..