Vijay devarakonda-samantha | ‘ఖుషి’ టైటిల్‌తో విజయ్ నెక్స్ట్ సినిమా.. ఆకట్టుకుంటున్న టైటిల్ పోస్టర్!
Vijay devarakonda-samantha | రౌడి స్టార్ విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇదే కాంబోలో జనగణమన తెరకెక్కనుంది. లైగర్ విడుదల తర్వాతే ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించనుంది. ఈ క్రమంలో విజయ్.. శివ నిర్వాణతో సినిమాను పట్టాలెక్కించాడు. ప్రస్తుతం కాశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పోస్టర్లో విజయ్ దేవరకొండ సిగరెట్ తాగుతూ కూల్ లుక్‌లో ఉండగా.. సమంత పెళ్ళి కూతురు గెటప్‌లో ఉంది. ఈ చిత్రానికి ‘ఖుషి’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. కాశ్మీర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఆర్మీ ఆధికారిగా కనిపించనున్నాడు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 23న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
An explosion of Happiness, laughter, Love and family bonding ❤️#Kushi – Telugu Tamil Kannada Malayalam Dec 23 Worldwide Release
Spread the joy this Christmas, New Years 😍@Samanthaprabhu2 @ShivaNirvana @MythriOfficial @HeshamAWMusic pic.twitter.com/HT3C38IT7I
— Vijay Deverakonda (@TheDeverakonda) May 16, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

