Tamannaah-Vijay Varma | టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah), బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma) డేటింగ్లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఈ జంట ఇటీవలే క్లారిటీ ఇచ్చింది. ‘లస్ట్ స్టోరీస్ 2’ ప్రమోషన్స్ లో భాగంగా వీరిద్దరూ తమ మధ్య ఉన్న బంధం గురించి వెల్లడించారు. తామిద్దరం రిలేషన్ లో ఉన్నట్లు తెలిపారు.
కాగా, తాజాగా మరోసారి తమన్నాతో బంధంపై విజయ్ వర్మ స్పందించారు. ‘తమన్నాతో చాలా సంతోషంగా ఉన్నాను. తనను పిచ్చిగా ప్రేమిస్తున్నాను. తను నా లైఫ్ లో అడుగుపెట్టాక విలన్ దశ ముగిసిపోయింది. ఇప్పుడు రొమాంటింక్ దశ మొదలైంది’ అంటూ చెప్పుకొచ్చారు.
విజయ్ వర్మతో తనకున్న బంధం గురించి తమన్నా ఇటీవలే పెదవి విప్పిన విషయం తెలిసిందే. ‘లస్ స్టోరీస్ 2’ (Lust Stories 2) సెట్స్ లో తమ ప్రేమ కథ మొదలైనట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ జంట మధ్య పరిచయం ఏర్పడి.. అదికాస్తా ప్రేమగా మారినట్లు తెలిపింది.
Also Read..
Alia Bhatt | జర్నలిస్ట్ చెప్పును చేత్తో తీసి ఇచ్చిన అలియా.. పొగడ్తలతో ముంచెత్తుతున్న నెటిజన్లు
Delhi Floods | ఢిల్లీ వరదలకు హర్యానా ప్రభుత్వమే కారణం : ఆప్
Joe Biden: ఏమి తిన్నా జాగ్రత్తగా ఉంటా.. ప్రిగోజిన్ అంశంపై జోకేసిన బైడెన్