Joe Biden: ఏమి తిన్నా జాగ్రత్తగా ఉంటా.. ప్రిగోజిన్ అంశంపై జోకేసిన బైడెన్
Joe Biden: ఒకవేళ తానే ప్రిగోజిన్ అయితే, అప్పుడు తినే ఆహారం పట్ల తాను జాగ్రత్తగా ఉండేవాడినని బైడెన్ అన్నారు. తనకు ఇచ్చే మెనూ పట్ల తన దృష్టిని నిలిపేవాడినన్నారు. ప్రిగోజిన్ గురించి మాట్లాడుతూ.. రష్యాలో అతని భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని వైట్‌హౌజ్‌లో బైడెన్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా వాగ్నర్ గ్రూపు చీఫ్ ప్రిగోజిన్ సైనిక తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అయితే పుతిన్ వార్నింగ్‌తో అతను వెనక్కి తగ్గాడు. కానీ ఇప్పటి వరకు మళ్లీ ప్రిగోజిన్ ఆచూకీ లేదు. రోస్తోవ్ నగరాన్ని జూన్ 24వ తేదీన ప్రిగోజిన్ వీడాడు. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియదు. ప్రిగోజిన్ ఆచూకీ తెలియదని, కానీ బహుశా అతనికి విషం ఇచ్చి ఉంటారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) జోక్ వేశారు. గురువారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ తానే ప్రిగోజిన్ అయితే, అప్పుడు భుజించే ఆహారం పట్ల తాను జాగ్రత్తగా ఉండేవాడినని బైడెన్ అన్నారు. తనకు ఇచ్చే మెనూ పట్ల తన దృష్టిని నిలిపేవాడినన్నారు. ప్రిగోజిన్ గురించి మాట్లాడుతూ.. రష్యాలో అతని భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని వైట్‌హౌజ్‌లో బైడెన్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన తర్వాత రష్యాకు అనుకూలంగా వాగ్నర్ ప్రైవేటు సైన్యం పోరాటం చేసింది. అయితే ఇటీవల తమ దళానికి రష్యా ఆయుధాలు ఇవ్వడం లేదని ప్రిగోజిన్ ఆరోపించారు. రష్యాపై తిరుగుబాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పుతిన్ వార్నింగ్ ఇవ్వడంతో రెండు రోజులకే ప్రిగోజిన్ తన ప్లాన్ మార్చుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

