Vijay – Trisha | కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష పేర్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తరచూ చర్చకు వస్తున్నాయి. వీరిద్దరి గురించి పలు రకాల ప్రచారాలు జరుగుతున్నప్పటికీ, వాటిపై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో తమిళనాడులో జరిగిన ఓ ఆలయ ఉత్సవంలో విజయ్, త్రిష చిత్రాలతో ఏర్పాటు చేసిన బ్యానర్ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. తమిళనాడులోని సేలం జిల్లా ఆత్తూర్‌లో జరుగుతున్న మారియమ్మన్ ఆలయ ఆషాఢ ఉత్సవాల సందర్భంగా కొందరు యువకులు ప్రత్యేక బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్లో విజయ్ను పది తలల రావణాసురుడి రూపంలో, త్రిషను అమ్మవారి రూపంలో చిత్రీకరించారు. ఈ డిజైన్ స్థానికంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా వేగంగా వైరల్ అయింది.
బ్యానర్ బయటకు రావడంతో నెటిజన్లు, స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్రమైన ఆలయ ఉత్సవాల్లో సినీ ప్రముఖుల చిత్రాలను ఈ విధంగా ఉపయోగించడం సరికాదని పలువురు విమర్శించారు. ముఖ్యంగా దేవతా రూపాలతో నటీనటులను పోల్చి చూపడంపై ఆగ్రహం వ్యక్తమైంది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో అధికారులు వెంటనే స్పందించారు. వివాదాస్పద బ్యానర్‌ను తొలగించడంతో పాటు, దానిని ఏర్పాటు చేసిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా, విజయ్–త్రిష గురించి గత కొంతకాలంగా వస్తున్న ప్రచారాల మధ్య ఈ బ్యానర్ మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనపై విజయ్ గానీ, త్రిష గానీ ఇప్పటివరకు స్పందించలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని అభిమానుల అత్యుత్సాహంగా అభివర్ణిస్తుండగా, మరికొందరు మతపరమైన కార్యక్రమాల్లో ఇలాంటి చర్యలు నివారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
Salem, attur periya mariamman temple festival banner depicting actress Trisha as the Goddess and featuring CM vijay image potray Raavanan.
case has been registered against those who put up the banner.#TNCMVijay #TVKVijay #tirsha #raavanan pic.twitter.com/dsnZQ8lii2
— Mageshkumar Ramalingam (@mageshkumar27) July 21, 2026