బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shahrukh Khan), స్టార్ డైరెక్టర్ ఆట్లీ (Atlee) కాంబినేషన్లో వస్తున్న చిత్రం జవాన్ (Jawan). హై యాక్షన్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అప్ డేట్ వచ్చింది.
ఈ పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా కనిపించబోతున్నాడట మక్కళ్ సెల్వన్. ఈ నెల చివరలో చెన్నై షెడ్యూల్లో కూడా జాయిన్ కాబోతున్నట్టు ఓ వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే మరో హీరోయిన్గా నటిస్తోంది. 2023 జూన్ 2న విడుదల కానుంది జవాన్.
హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది జవాన్ . షారుక్ ఖాన్ మరోవైపు సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో పఠాన్ సినిమా కూడా చేస్తున్నాడు. దీపికా పదుకొనే, జాన్ అబ్రహాం కీ రోల్స్ చేస్తున్నారు. దీంతోపాటు మల్టీ స్టారర్ చిత్రం బ్రహ్మాస్త్రలో శాస్త్రవేత్త పాత్రలో కనిపించబోతున్నాడని బీటౌన్ సర్కిల్ టాక్.