Jana Nayagan Second Look | తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ మరికొన్ని రోజుల్లో సినిమాలు దూరమవుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ తమిళ వెట్రి కళగం(TVK) అనే పార్టీని స్థాపించాడు. ఇక నుంచి తాను పూర్తిగా రాజకీయల్లోనే ఉంటానని.. ఇదే తన చివరి చిత్రం అంటూ దళపతి69 (Thalapathy69) ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు. జన నాయగన్ (ప్రజల నాయకుడు) అనే టైటిల్‌తో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను కార్తీ (ఖాకీ) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హెచ్.వినోద్ దర్శకత్వం వహించబోతున్నాడు.
రిపబ్లిక్ డే కానుకగా ఈరోజు ఉదయం చిత్రం నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మూవీ నుంచి విజయ్ సెకండ్ లుక్ పోస్టర్‌ను వదిలారు. కొరడా పట్టుకుని ఉన్న విజయ్ లుక్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనుండగా.. కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రోడక్షన్ ఈ మూవీని నిర్మించనుంది. ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాను అక్టోబర్ 2025న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
Jana Nayagan Second Look