Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న వేళ, కోలీవుడ్ స్టార్ విజయ్ రాజకీయ ప్రవేశం భారీ చర్చకు దారి తీసింది. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఈసారి ఎన్నికల్లో అనూహ్యంగా లీడ్‌లో కొనసాగుతుండటంతో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో మరో ఆసక్తికర ట్రెండ్ వైరల్ అవుతోంది. ప్రముఖ నటి త్రిష కృష్ఱన్ పుట్టినరోజు కూడా నేడే కావడంతో, విజయ్ లీడ్‌ను ఆమె బర్త్‌డేతో లింక్ చేస్తూ ఫ్యాన్స్ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. “ఇది త్రిషకు బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్” అంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల విజయ్-త్రిష మధ్య సంబంధంపై వస్తున్న రూమర్లు కూడా ఈ ట్రెండ్‌కు మరింత ఊపునిచ్చాయి. దీంతో సోషల్ మీడియా మొత్తం ఒక పెద్ద మీమ్ ఫెస్టివల్‌లా మారిపోయింది. ముఖ్యంగా పుష్ప 2: ది రూల్ సినిమా రిఫరెన్స్‌లతో మీమ్స్ హోరెత్తుతున్నాయి. సినిమాలో హీరో సీఎం అవుతాడనే సన్నివేశాన్ని పోల్చుతూ, “త్రిష బర్త్‌డే రోజునే విజయ్ సీఎం అవుతున్నాడు” అంటూ ఫ్యాన్స్ సరదాగా పోస్టులు చేస్తున్నారు. అలాగే సినిమాలో వచ్చే డైలాగ్‌ను మార్చి, “ఇవాళ త్రిష బర్త్‌డే కాబట్టి విజయ్ లీడ్‌లోకి వచ్చాడు” అంటూ క్రియేటివ్ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.ఈ మీమ్స్ నెట్టింట ట్రెండింగ్‌లో నిలుస్తూ, అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. సినిమా, రాజకీయాలు, సెలబ్రిటీ కల్చర్ అన్నీ ఒకేసారి సోషల్ మీడియాలో అరుదైన ట్రెండ్‌ను సృష్టించాయి.
రాజకీయంగా చూస్తే, తొలి సారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ పార్టీ ఇంతటి స్థాయిలో లీడ్ సాధించడం విశేషం. ఇది కేవలం అభిమానులకు మాత్రమే కాకుండా రాజకీయ విశ్లేషకులకు కూడా ఆసక్తికర అంశంగా మారింది. సినిమా నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాయకుడిగా విజయ్ తన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే సోషల్ మీడియాలో విజయ్ విజయోత్సాహం కనిపిస్తోంది. అదే సమయంలో త్రిష పుట్టినరోజు ఈ వేడుకకు మరింత జోష్‌ను తీసుకువచ్చి, ఈ రెండు అంశాలను కలిపి నెట్టింట ఒక ప్రత్యేక ట్రెండ్‌గా నిలిపింది.
Birthday Gift 😮💨🎊#TVK #Vijay #TVKVijay pic.twitter.com/D2Sh6Cz4vq
— Sarath (@SarathOfficiaal) May 4, 2026