Rowdy Janardhana | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే కానుక అందించింది. యువ దర్శకుడు రవికిరణ్ కోల దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రౌడీ జనార్థన’.
ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక పవర్ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో విజయ్ ఇంటెన్స్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. అతడి గుండెపై హీరోయిన్ కాలుపెట్టగా.. ప్రపంచంతో పోరాడే మొండివాడు.. కానీ ప్రేమకు మాత్రమే తలవంచుతాడు అంటూ ఈ పోస్టర్‌కి క్యాప్షన్ ఇచ్చారు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
“The soul” of ROWDY JANARDHANA.
A man who fights the world…
but surrenders only to love ❤️Wishing our #RowdyJanardhana @TheDeverakonda a very Happy Birthday 🔥#HBDVijayDeverakonda@keerthyofficial #AnendCChandran @DinoShankar @PraveenRaja_Off @SVC_official @Tseries… pic.twitter.com/8rQYuafGIM
— Ravi Kiran Kola (@storytellerkola) May 9, 2026