Vijay Devarakonda | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుండగా విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ షూటింగ్లో బిజీగా ఉండగా.. మార్చి నుంచి ‘వీడీ12’ సినిమా షూటింగ్ ప్రారంభంకానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా మొదట శ్రీలీల పేరు వినిపించిన విషయం తెలిసిందే.
అయితే తాజా సమాచారం ప్రకారం శ్రీలీల స్థానంలో బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తుంది. ఈ విషయంపై త్రిప్తితో సంప్రదింపులు జరపగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణీ వసంత్ కూడా ఈ సినిమాలో కథానాయికగా ఎంపిక అయినట్లు టాక్. కాగా దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ తెరకెక్కిస్తున్నది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు.
విజయ్ ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఒక భారీ షెడ్యూల్‌ను ఇటీవలే న్యూయార్క్‌లో పూర్తి చేశారు మేకర్స్. పరశురాం దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయిక.