అన్నా అంటేనే ఉన్నానంటూనే..
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ‘కింగ్డమ్' చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ పీరియాడిక్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించడంతో విజయ్ దేవరకొండ అభిమానులు హిట్ పక్కా అంటూ విశ్వాసంగా ఉన్నారు.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ‘కింగ్డమ్’ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ పీరియాడిక్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించడంతో విజయ్ దేవరకొండ అభిమానులు హిట్ పక్కా అంటూ విశ్వాసంగా ఉన్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రచార కార్యక్రమాల్ని మరింత ముమ్మరం చేశారు. బుధవారం ‘అన్నా అంటేనే..’ అనే రెండో గీతాన్ని విడుదల చేశారు. దీనిని అనిరుధ్ రవిచందర్ స్వరపరచడంతో పాటు ఆలపించారు.
కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ హృదయానికి హత్తుకునేలా ఈ పాట సాగింది. ఇందులో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ సోదరులుగా కనిపించారు. ‘చిన్నతనమే ఏమైపోయే, నన్ను వదిలే నీదే చేయే, అంత కలలాగే కరిగే, అందమైన గూడే చెదిరే, కష్టమొచ్చినా ఇంకో వైపే..కంటిరెప్పలా కాసే కాపే..కొన్ని గుర్తులేవో మిగిలే, చిన్నిగుండె నాదే పగిలే, అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం నిలబడతావే..కలబడతావే..’ అంటూ మనసును తాకే భావాలతో ఈ పాట సాగింది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | సూర్య ‘సీన్’ సినిమాతో తమిళనాడులో మళ్లీ తెల్లవారుజాము షోలు .. కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ!
AP News | టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అప్పల నాయుడు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ.. ఇండియా టార్గెట్ 260
మద్దూరును కరువు మండలంగా ప్రకటించాలి.. మండల సభను బహిష్కరించిన సర్పంచులు
Eetha Trailer | ‘ఛావా’ దర్శకుడి కొత్త సినిమా.. శ్రద్ధా కపూర్ ‘ఈఠా’ ట్రైలర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

