శ్రీలంకలో సాంగ్ షూట్
సక్సెస్, ఫెయిల్యూర్లకు సంబంధం లేని స్టార్డమ్ విజయ్ దేవరకొండది. సరైన సినిమా పడితే.. రికార్డులు బద్దలుకొట్టడం అతనికి పెద్ద విషయం కాదు. అలాంటి విజయం కోసం తనతో పాటు తన అభిమానులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు.
సక్సెస్, ఫెయిల్యూర్లకు సంబంధం లేని స్టార్డమ్ విజయ్ దేవరకొండది. సరైన సినిమా పడితే.. రికార్డులు బద్దలుకొట్టడం అతనికి పెద్ద విషయం కాదు. అలాంటి విజయం కోసం తనతో పాటు తన అభిమానులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్ డమ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి ‘జెర్సీ’ సినిమా వాణిజ్యపరంగా విజయాన్ని సాధించడంతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో గౌతమ్ చేస్తున్న ‘కింగ్ డమ్’ సినిమా కూడా మనసుల్ని మెలిపెట్టే భావోద్వేగాలతో విభిన్నంగా ఉంటుందని తెలుస్తున్నది.
70శాతం చిత్రీకరణ పూర్తయింది. వారం రోజుల షెడ్యూల్‌ని మేకర్స్ శ్రీలంకలో ప్లాన్ చేశారు. అక్కడ ఓ లవ్సాంగ్తో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. అందుకే చిత్ర యూనిట్ శ్రీలంక పయనమయ్యారు. దీనికి సంబంధించిన విజయ్ దేవరకొండ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రౌడీ ట్రెండీ సమ్మర్ వేర్లో ైస్టెల్ ఐకాన్‌గా ఈ ఫొటోల్లో విజయ్ కనిపిస్తున్నారు. మే 30న ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్యలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, నిర్మాణం: సితార ఎంటైర్టెన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

