Vijay Deverakonda | విజయ్‌దేవరకొండ, చిరంజీవి ఇంట సంక్రాంతి సందడి.. ట్రెండింగ్‌లో స్టిల్స్
Vijay Deverakonda | క్లాస్, మాస్, యాక్షన్.. ఇలా ఏ రోల్లో అయినా సరే అభిమానులను ఇంప్రెస్ చేయడంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) రూటే సెపరేటు అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా ఈ హీరో సంప్రదాయ లుక్‌లోకి మారిపోయాడు.
Vijay Deverakonda | క్లాస్, మాస్, యాక్షన్.. ఇలా ఏ రోల్లో అయినా సరే అభిమానులను ఇంప్రెస్ చేయడంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) రూటే సెపరేటు అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రౌడీ వేర్లోనైనా, ట్రెండీ డ్రెస్సులోనైనా, సంప్రదాయ వస్త్రధారణలోనైనా.. నయా లుక్‌లో కనిపించాలంటే విజయ్ తర్వాతే ఎవరైనా అని నెట్టింట ప్రత్యక్షమయ్యే ఫొటోలు చెబుతాయి. తాజాగా ఈ హీరో సంప్రదాయ లుక్‌లోకి మారిపోయాడు.
సంక్రాంతి సంబురాల్లో భాగంగా విజయ్ దేవరకొండ పంచెకట్టులో మెరిసిపోయాడు. అమ్మానాన్న, తమ్ముడు ఆనంద్‌తో కలిసి ప్రత్యేక పూజాకార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు సంక్రాంతి వేడుకల్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఫ్యామిలీ అంతా ఒక్క చోట చేరి సందడి చేసింది. బెంగళూరులో అల్లు, మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.
తన తల్లి అంజనాదేవి, సతీమణి సురేఖతోపాటు రాంచరణ్, ఉపాసన దంపతులు, అల్లు అర్జున్-స్నేహ, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి, అకీరా నందన్, ఆద్య, నిహారిక, శ్రీజ, అల్లు శిరీష్ సహా ఇతర కుటుంబసభ్యులు సంక్రాంతి వేడుకల్లోపాల్గొన్న ఫొటోను షేర్ చేస్తూ.. పాడి పంటల, భోగభాగ్యాల ఈ సంక్రాంతి ప్రతి ఇంటా ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశాడు చిరంజీవి. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలు..
పాడి పంటల,భోగ భాగ్యాల ఈ సంక్రాంతి
ప్రతి ఇంటా ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ! pic.twitter.com/4rpfN0s6lZ— Chiranjeevi Konidela (@KChiruTweets) January 15, 2024
సంక్రాంతి వేడుకల్లో విజయ్‌దేవరకొండ..
Andariki Sankranthi Subhakankshalu ❤️✨ pic.twitter.com/WmsxJcISrH
— Vijay Deverakonda (@TheDeverakonda) January 15, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water conservation | నీటి కోసం స్ఫూర్తిగా నిలిచిన.. ఆదర్శ నగర్ కాలనీ వాసులు
Heart Diseases | పండుగ సమయంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ.. హృదయ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..
Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

