Vijay Deverakonda | ప్రభాస్ కల్కి 2898 ఏడీలో స్పెషల్ అట్రాక్షన్‌గా విజయ్ దేవరకొండ.. అర్జున లుక్ వైరల్
Vijay Deverakonda | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కగా.. ప్రపంచవ్యా్ప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో జూన్ 27 (గురువారం) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
Vijay Deverakonda | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కగా.. ప్రపంచవ్యా్ప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో జూన్ 27 (గురువారం) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
కాగా ఈ చిత్రంలో స్టార్ సెలబ్రిటీలు సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తున్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమ అభిమాన యాక్టర్లు సిల్వర్ స్క్రీన్‌పై కనిపించగానే థియేటర్లలో ఈలలు, కేకలతో దద్దరిల్లిపోతున్నాయి. కల్కిలో సందడి చేసిన స్టార్ హీరోల్లో ఒకడు విజయ్ దేవరకొండ. సినిమా విడుదలయ్యే వరకు విజయ్ దేవరకొండ ఎంట్రీకి సంబంధించి సస్పెన్స్ మెయింటైన్ చేశాడు నాగ్ అశ్విన్. ఇందులో అర్జునుడుగా పవర్ ఫుల్ రోల్లో కనిపించాడు రౌడీ బాయ్.
అర్జునుడి గెటప్‌లో రథంపై నిలబడి విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్స్ అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాయి. తాజాగా మేకర్స్ అర్జున లుక్‌ను అందరితో పంచుకున్నారు. విజయ్ దేవరకొండ రాజసం ఉట్టిపడే లుక్‌లో ఠీవిగా నిలబడి విల్లు ఎక్కుపెట్టిన పోస్టర్ నెట్టింటిని షేక్ చేస్తోంది. కల్కి 2898 ఏడీ విడుదలైన అన్ని కేంద్రాల్లో తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
ఈ మూవీ ఫస్ట్ వీక్‌లోనే రూ.700 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలుస్తోంది. 2024లో హిందీలో భారీ హిట్‌గా నిలిచి.. అరుదైన రికార్డును సొంతం చేసుకునే దిశగా ముందుకెళ్తోంది. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించారు. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రల్లో నటించగా.. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు.
కల్కి 2898 ఏడీ అర్జున లుక్..
Presenting our dearest @TheDeverakonda as the courageous 𝐀𝐑𝐉𝐔𝐍𝐀 ❤️🔥#EpicBlockbusterKalki in cinemas – https://t.co/xbbZpkX7g0#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD… pic.twitter.com/fCMQfpk1sZ
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 4, 2024
Read also :
Kanguva | నైజాంలో సూర్య కంగువను విడుదల చేస్తుందెవరో తెలుసా..?
Disha Patani | దిశా పటానీ టాటూ మిస్టరీ వీడింది.. ఇంతకీ ఏంటో తెలుసా..?
Darshan wife | ఆమె దర్శన్ భార్య కాదు.. పవిత్రాగౌడపై నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి
Saripodhaa Sanivaaram | ఇంతకీ నాని ఎటు వెళ్తున్నాడో.. సరిపోదా శనివారం సెకండ్ లుక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

