ప్రేమకథకు శ్రీకారం
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్‌నివ్వగా, ఫైనాన్షియర్ సత్తె రంగయ్య కెమెరా స్విఛాన్ చేశారు. విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
‘ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’ అని చిత్ర బృందం పేర్కొంది. విజయ్‌దేవరకొండ-పరశురామ్ కాంబినేషన్లో వచ్చిన ‘గీత గోవిందం’ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పించింది. దాంతో తాజా చిత్రం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. ఈ చిత్రానికి కెమెరా: కేయూ మోహనన్, సంగీతం: గోపీసుందర్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, నిర్మాతలు: దిల్‌రాజు-శిరీష్, రచన-దర్శకత్వం: పరశురామ్ పెట్ల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

