Liger Movie | ఓటీటీలోకి ‘లైగర్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Liger Movie On OTT | విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'లైగర్'. 'వరల్డ్ ఫేమస్ లవర్' తర్వాత దాదాపు రెండేళ్ళు గ్యాప్ తీసుకుని విజయ్ 'లైగర్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది.
Liger Movie On OTT | విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘లైగర్’. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత దాదాపు రెండేళ్ళు గ్యాప్ తీసుకుని విజయ్ ‘లైగర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. రిలీజ్ రోజు ఓపెనింగ్స్ పర్వాలేదనిపించిన రెండవ రోజు నుండి ఫుల్ డ్రాప్స్ పడ్డాయి. కనీసం థియేటర్ రెంట్‌కు సరిపడ కలెక్షన్లు కూడా రాకపోవడంతో వారంలోపే సినిమాను తీసేసారు. ఈ సినిమా ఫలితం మేకర్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా డిజిటల్ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
‘లైగర్’ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘డిస్నీ+హాట్‌స్టార్’ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం గురువారం(సెప్టెంబర్ 22) నుండి స్ట్రీమింగ్ కానుంది. ముందుగా ఈ చిత్రాన్ని 50రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్, హాట్‌స్టార్‌తో డీల్ కుదిరించుకున్నారు. అయితే సినిమా ఫ్లాప్ అవడంతో హాట్‌స్టార్ సంస్థ ముందు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఆఫర్ చేసిందట. ఆఫర్ నచ్చడంతో మేకర్స్ కూడా ఒప్పుకున్నారట. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. విజయ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే హీరోయిన్గా నటించింది. ప్రముఖ బాక్సర్ మైఖ్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. రూ.85 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో రంగంలోకి దిగిన ఈ చిత్రం ఫైనల్‌గా రూ.30 కోట్ల వరకు కలెక్షన్లు సాధించి మేకర్స్‌కు తీవ్ర నష్టాల్ని మిగిల్చింది. ప్రతి ఏరియాలో ఫ్లాప్ అయిన ఈ చిత్రం ఒక్క హిందీలో మాత్రం ఎబో-యావరేజ్‌గా నిలిచింది.
Read Also:
Liger Movie | ‘లైగర్’ చిత్రంతో పూరి జగన్నాధ్ అన్ని కోట్లు నష్టపోయాడా?
Gauri Khan Promo | ‘ఒకేసారి ఇద్దరు బాయ్స్‌తో డేటింగ్ వద్దు..’స్టార్ హీరో భార్య ప్రోమో వైరల్
Naga Chaitanya | పోలీస్ అధికారిగా నాగచైతన్య.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘NC22’ ప్రీ లుక్ పోస్టర్
God Father Movie | ‘గాడ్‌ఫాదర్’ మూవీ బిజినెస్ వాల్యూ అన్ని కోట్లా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

