విజయుడిగా విశ్వరూపం
‘కల్కి 2898 ఏడీ’ సినిమా చూసిన వాళ్లంతా హఠాత్తుగా అర్జునుడి పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండను చూసి ఫిదా అయిపోతున్నారు.
‘కల్కి 2898 ఏడీ’ సినిమా చూసిన వాళ్లంతా హఠాత్తుగా అర్జునుడి పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండను చూసి ఫిదా అయిపోతున్నారు. ఇన్నాళ్లూ యూత్ ఐకాన్‌గా మాత్రమే కనిపించి, మురిపించిన విజయ్ దేవరకొండ.. ‘కల్కి 2898 ఏడీ’లో గాండీవాన్ని ధరించి, అర్జునుడిగా కాసేపు చెలరేగిపోయాడు. నిజానికి మైథలాజికల్ పాత్రలు రావడమే అరుదు. పైగా అర్జునుడి పాత్ర. నిడివి తక్కువే అయినా అదరహో అనిపించాడు.
విజయుడిగా విజయ్ మేకోవర్, చెప్పిన పవర్ఫుల్ డైలాగులు, పలికించిన ఎమోషన్స్ ‘కల్కి’ హైలైట్స్‌లో భాగమయ్యాయి. తెరపై విజయుడిగా విజయ్ దేవరకొండను చూడగానే ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో స్పందన వస్తున్నది. ఏదిఏమైనా విజయ్ అని పేరు పెట్టుకున్నందుకు ధనుర్ధారి విజయుడిగా తెరపై విశ్వరూపం చూపించి, సార్థకనాముడు అనిపించుకున్నాడు విజయ్ దేవరకొండ. ‘కల్కి 2898ఏడీ’ సినిమాతో.. విజయ్‌తో మైథలాజికల్ కేరక్టర్లు కూడా ట్రై చేయొచ్చని నిరూపితమైందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

