Gaami | టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ (Vishwak sen) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘గామి’ (Gaami). చాందిని చౌదరి కథానాయిక నటిస్తున్న ఈ సినిమాకు విద్యాధర్ కాగిత దర్శకత్వం వహిస్తున్నాడు. క్రౌడ్ ఫండింగ్‌లో భాగంగా చేసిన ఈ సినిమాకు కార్తీక్ శబరీష్ నిర్మాత. ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా మార్చి 08న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో తాజాగా ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.
సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు నిర్మాణ సంస్థ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా 148 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు సమాచారం. మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించలేం. అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న అఘోర శంకర్ హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్రం. ఇక ఈ సినిమాను మార్చి 08న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అభినయ, మహ్మద్ సమద్, హారిక పెడద, దయానంద్ రెడ్డి, శాంతి రావు, మయాంక్ పరాఖ్, జాన్ కొట్టోలీ, బొమ్మ శ్రీధర్, రజనీష్ శర్మ, శరత్ కుమార్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
#Gaami – Censor Rating – A 🤯 pic.twitter.com/e4UvSgbzQN
— Movies4u (@Movies4uOfficl) March 5, 2024