Vihari OTT App | నవంబర్‌లో ‘విహారి’ ఓటీటీ యాప్ గ్రాండ్ లాంచ్.. ఘనంగా ప్రోమో వేడుక!
Vihari OTT App | తెలుగు టెలివిజన్ రంగంలో సరికొత్త ప్రయాణ విజ్ఞానాన్ని పరిచయం చేస్తూ, గత 18 ఏళ్లుగా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రముఖ ట్రావెల్ షో "విహారి - ద ట్రావెలర్" ఇప్పుడు సరికొత్త హంగులతో డిజిటల్ మాధ్యమలోకి అడుగుపెడుతోంది.
Vihari OTT App | తెలుగు టెలివిజన్ రంగంలో సరికొత్త ప్రయాణ విజ్ఞానాన్ని పరిచయం చేస్తూ, గత 18 ఏళ్లుగా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రముఖ ట్రావెల్ షో “విహారి – ద ట్రావెలర్” ఇప్పుడు సరికొత్త హంగులతో డిజిటల్ మాధ్యమలోకి అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా ‘విహారి’ ఓటీటీ యాప్ ప్రోమో లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా అత్యంత వైభవంగా మరియు ఘనంగా నిర్వహించారు. 2004లో మా టీవీలో ప్రారంభమై, ఎన్నో మైలురాళ్లను విజయవంతంగా అధిగమించిన విహారి షో, ఇప్పుడు మరింత వినూత్న రీతిలో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ యాప్‌ను వ్యవస్థాపకులు మరియు దర్శకులు ఏ.ఎల్. నితిన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
గతంలో ట్రావెల్ గైడ్స్, డీవీడీలు మరియు ఫుడ్ రిలేటెడ్ కంటెంట్‌తో ఎంతోమందిని ఆకట్టుకున్న విహారి, కరుణ, స్నిగ్ధ వంటి ప్రముఖ యాంకర్ల ద్వారా ఎన్నో కలర్‌ఫుల్, ఇన్ఫర్మేటివ్ ఎపిసోడ్లను అందించింది. ఇకపై ఈ నవంబర్ నుండి లెజెండ్రీ యాంకర్ సుమతో కలిసి కొన్ని ఇన్నోవేటివ్ ఎపిసోడ్స్‌ను కూడా టెలికాస్ట్ చేయబోతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అంతేకాకుండా, ఈ ఓటీటీ యాప్‌కు హోస్ట్‌గా ప్రముఖ నటి శ్రీసత్యను ఎంపిక చేయడం విశేషం. ఈ గ్రాండ్ ప్రోమో లాంచ్ వేడుకకు సదరన్ ట్రావెల్స్ అధినేత ప్రవీణ్, వజ్ర కన్స్ట్రక్షన్స్ అధినేతలు రాజు మరియు శ్వేత, అలాగే యాంకర్ శ్రీసత్య తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రముఖ సంస్థలైన ‘టీటీఎఫ్’ (TTF) మరియు ‘వేగ జ్యువెలర్స్’ కూడా ఈ విహారి ఓటీటీ ప్రాజెక్ట్‌తో కొలాబరేట్ కావడం దీని ప్రత్యేకతను మరింత పెంచింది. ప్రస్తుతం విడుదలైన ప్రోమో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచగా, అసలు సిసలైన ఓటీటీ యాప్ నవంబర్‌లో లాంచ్ కానుంది.
ఈ ప్రత్యేక వేడుకలో సదరన్ ట్రావెల్స్ ప్రవీణ్ మాట్లాడుతూ, 2004 నుంచి నితిన్‌తో తనకు మంచి పరిచయం ఉందని, విహారి కాన్సెప్ట్ చెప్పినప్పుడే తనకు చాలా నచ్చిందని అన్నారు. నితిన్ ఎంచుకున్న ఈ ప్రయాణం నేడు ఆయన కంటే ఎత్తుగా ఎదిగి ఘన విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగువారూ విహారిని ఆదరిస్తున్నారని, ఓటీటీ రూపంలో వస్తున్న ఈ వేదిక కూడా ఘన విజయం సాధించాలని కోరుకున్నారు.
వజ్ర కన్స్ట్రక్షన్స్ అధినేత రాజు మాట్లాడుతూ, విహారి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఈ ప్రాజెక్ట్‌తో అసోసియేట్ కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నితిన్ చాలా యాంబిషియస్ మరియు మంచి వ్యక్తి అని, ఆయనతో కలిసి ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు.
వజ్ర కన్స్ట్రక్షన్స్ శ్వేత మాట్లాడుతూ, తాను చిన్నతనంలో ట్రావెల్ చేయడం ప్రారంభించకముందే విహారి ఎపిసోడ్స్ చూసి ప్రయాణాలు చేయాలని కలలు కనేదాన్నని తెలిపారు. నాటి తన బాల్యపు ఇష్టమైన షో అయిన విహారి ఓటీటీ యాప్‌తో ఇప్పుడు తమ సంస్థ కొలాబరేట్ కావడం చాలా సంతోషంగా ఉందని భావోద్వేగంగా పంచుకున్నారు.
విహారి అధినేత ఏ.ఎల్. నితిన్ మాట్లాడుతూ, 2004లో మా టీవీలో విహారిని ప్రారంభించినప్పుడు తనకు అండగా నిలిచిన కరుణ, పి.జి. వింద, స్నిగ్ధలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఓటీటీకి ఫేస్ ఎవరు ఉండాలని ఆలోచించినప్పుడు శ్రీసత్య పేరు వెంటనే గుర్తుకు వచ్చిందని, ఆమె చాలా డెడికేటెడ్ అండ్ కమిటెడ్ పర్సన్ అని కొనియాడారు. అలాగే మొదటి నుంచి తనకు సపోర్ట్ చేస్తున్న టీటీఎఫ్ మహేష్‌కు, సదరన్ ట్రావెల్స్ ప్రవీణ్‌కు, అలాగే నూతనంగా కోలాబరేట్ అయిన వజ్ర కన్స్ట్రక్షన్స్ రాజు, శ్వేత దంపతులకు మరియు వేగ జ్యువెలర్స్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ప్రముఖ యాంకర్ శ్రీసత్య మాట్లాడుతూ, ప్రతి విషయంలోనూ తనకు సపోర్ట్ చేస్తున్న మీడియాకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటివరకు తాను పూర్తిస్థాయిలో హోస్ట్‌గా వ్యవహరించలేదని, మొదటిసారి ఈ బాధ్యత తీసుకోగానే భయమేసినప్పటికీ నితిన్ గారు ఎంతో ధైర్యం చెప్పి ప్రోత్సహించారని తెలిపారు. విహారి అనేది కేవలం ట్రావెల్ షో మాత్రమే కాదని, ఒక సాధారణ బడ్జెట్లో ఎక్కడెక్కడ స్టే చేయొచ్చు, రుచికరమైన ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలు ఏంటి అనే పూర్తి వివరాలను అందించే గొప్ప గైడ్ అని అన్నారు. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌లో తనను భాగం చేసినందుకు నితిన్‌కు మరియు స్పాన్సర్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

