Vidya Balan | ది డర్టీ పిక్చర్ సినిమాతో దేశాన్ని ఓ ఊపు ఊపేసింది బాలీవుడ్ భామ విద్యాబాలన్ (Vidya Balan). ఈ బ్యూటీ నటిస్తోన్న మిస్టరీ ఫిల్మ్ నీయత్ (Neeyat). అనూ మీనన్ దర్శకత్వం వహించారు. అబండెన్షియా ఎంటర్టైన్మెంట్పై అమెజాన్ ప్రైమ్ వీడియోతో కలిసి విక్రమ్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.
జులై 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విద్యాబాలన్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది విద్యాబాలన్. నా దగ్గర గుడ్‌న్యూస్, బ్యాడ్ న్యూస్ ఉన్నాయి. మొదట బ్యాడ్ న్యూస్ చెప్తా. ఓ భారీ పార్టీలో పెద్ద వ్యాపారవేత్త హత్యగావించబడతాడు. ఇక గుడ్ న్యూస్.. నా కొత్త సినిమా నీయత్ కీ కహానీ.. బుకింగ్స్ మొదలయ్యాయి.. అంటూ ఓ వీడియో విడుదల చేసింది విద్యాబాలన్. ఇప్పుడీ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈ చిత్రంలో రామ్ కపూర్, రాహుల్ బోస్, దిపన్నిట శర్మ, శశాంక్ అరోరా, శహానా గోస్వామి, అమృతాపూరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో మర్డర్ మిస్టరీని చేధించే సీబీఐ ఆఫీసర్‌గా మీరా రావు పాత్రలో నటిస్తోంది విద్యాబాలన్.
‘NEEYAT’ ADVANCE BOOKINGS OPEN… IN CINEMAS TOMORROW… #VidyaBalan #AnuMenon #AmazonPrimeVideo #Abundantia #Neeyat pic.twitter.com/spgfXmLEKW
— taran adarsh (@taran_adarsh) July 6, 2023
నీయత్ ట్రైలర్
#NeeyatTrailer Looks Interesting….#Neeyat #VidyaBalan pic.twitter.com/aMWrNmaLm5
— Rohit Jaiswal (@rohitjswl01) June 22, 2023