Bad Newz | ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన బ్యాడ్ న్యూస్ స్టార్స్.. విక్కీ కౌశల్, త్రిప్తి వీడియో వైరల్
Bad Newz | బాలీవుడ్ స్టార్ నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో ప్రయాణించి ప్రయాణికులకు షాక్ ఇచ్చాడు.
Bad Newz | ఇటీవలే కొందరు స్టార్ సెలబ్రిటీలు ప్రజా రవాణాను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ తారలు ఆటో, మెట్రో రైలు వంటి వాటిలో ప్రయాణిస్తూ కెమెరా కంటికి చిక్కుతున్నారు. ఎక్కువగా మెట్రో రైలునే ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే.. రోడ్డుపై ట్రాఫిక్ కష్టాలను తప్పించుకునేందుకు మెట్రో అనువైన మార్గం కావడంతో చాలా మంది తారలు మెట్రోను అనుసరిస్తున్నారు. సినిమా ప్రొమోషన్స్, ఇతర ప్రాంతాలకు ప్రయాణించడం వంటి వాటికోసం దీన్ని ఆశ్రయిస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో ప్రయాణించి ప్రయాణికులకు షాక్ ఇచ్చాడు. ఆయన కథానాయకుడిగా, త్రిప్తి డిమ్రీ కథానాయికగా రూపొందిన ‘బ్యాడ్‌న్యూస్’ (Bad Newz)సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా విరివిగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు విక్కీకౌశల్. ఇందులో భాగంగానే దేశ రాజధానిలో విక్కీ తన సినిమా ప్రమోషన్స్‌ను షురూ చేశారు. అభిమానులతో మీట్-అండ్- గ్రీట్ వంటి సెషన్స్ (meet-and-greet sessions)ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సహ నటులు త్రిప్తి డిమ్రీ, అమ్మీ విర్క్‌తో కలిసి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. రైల్లో వీరు ముగ్గురూ ఒకచోట నిల్చొని సరదాగా మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
విక్కీ కౌశల్, యానిమల్ ఫేం తృప్తి డిమ్రి (Tripti Dimri) కాంబోలో వస్తున్న చిత్రం Bad Newz. ఆనంద్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అమ్మి విర్క్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. నేహా ధూపియా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ జులై 19న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. Bad Newz పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో (పోస్ట్ థ్రియాట్రికల్) స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్లు, ప్రమోషన్స్ తో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ అవుతోంది.
Also Read..
Rahul Gandhi | భద్రతా లోపాలకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత.. దోడా ఉగ్రదాడి ఘటనపై రాహుల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

