Lyricist Dev Kohli Passes away | బాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సాహిత్య కళాకారుడు(లిరిసిస్ట్) దేవ్ కోహ్లి కన్నుమూశాడు. ఆయన వయసు 80 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యల కారణంగా ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న దేవ్ కోహ్లి శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. దేవ్ కోహ్లి హిందీలో వందలకు పైగా పాటలు రాశాడు. షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్లకు గొప్ప గొప్ప పాటలు రాశాడు.
దేవ్ కోహ్లీ ‘మైనే ప్యార్ కియా’, ‘బాజీగర్’, ‘జుడ్వా 2’, ‘ముసాఫిర్’, ‘షూట్ అవుట్ ఎట్ లోఖండ్వాలా’ , ‘టాక్సీ నమ్ 911’ వంటి హిట్ సినిమాలకు పాటలు రాశాడు. అను మాలిక్, రామ్ లక్ష్మణ్, ఆనంద్ రాజ్ ఆనంద్, ఆనంద్ మిలింద్ వంటి పలువురు సంగీత దర్శకులకు చార్ట్ బస్టర్ సాంగ్స్ రాశాడు. 1969లో వచ్చిన గుండా సినిమాతో దేవ్ కోహ్లి కెరీర్‌ను ప్రారంభించాడు. అయితే ఆయనకు బ్రేక్ తెచ్చిపెట్టింది మాత్రం హేమామాలిని నటించిన లాల్ పత్తర్ సినిమాలోని గీత్ గీతా హూన్ మేయిన్ అనే పాట. ఆ తర్వాత గేయ రచయితగా దేవ్ కోహ్లి వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఇక దేవ్ కోహ్లి అంత్యక్రియలు సాయంత్రం 6 గంటలకు జోగేశ్వరి వెస్ట్‌లోని ఓషివారా శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.