Vennela Kishor | ఇండియన్-2లో వెన్నెల కిషోర్.. క్లారిటీ ఇచ్చిన నటుడు
గత పుష్కర కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్‌గా ఏకచక్రాధిపత్యం కొనసాగిస్తున్నాడు వెన్నెల కిషోర్. బ్రహ్మనందం తర్వాత ఆ స్థాయి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుని సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నాడు.
Vennela Kishor | గత పుష్కర కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్‌గా ఏకచక్రాధిపత్యం కొనసాగిస్తున్నాడు వెన్నెల కిషోర్. బ్రహ్మనందం తర్వాత ఆ స్థాయి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుని సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. తెరపై వెన్నెల కిషోర్ కనిపించాడంటే చాలు.. నవ్వు దానంతట అదే వస్తుంది. అంతలా తన కామెడితో చేరువయ్యాడు. లెక్కలేనన్ని సినిమాలు కేవలం వెన్నెల కిషోర్ కామెడీతో నిలబడ్డాయనడంలో అతిశయోక్తి లేదు. కేవలం కమెడియన్‌గానే కాకుండా ఈ మధ్య నెగెటీవ్ పాత్రలతోనూ మెప్పిస్తున్నాడు. ఇదిలా ఉంటే గతరెండు రోజులుగా వెన్నెల కిషోర్ ఇండియన్-2లో నటిస్తున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి.
ఇండియన్-2లో నెగెటీవ్ పాత్ర పోషిస్తున్నాడని, కథను మలుపు తిప్పే పాత్ర తనదని సోషల్ మీడియాలో తెగ వార్తలు పుట్టుకొచ్చాయి. కాగా తాజాగా ఈ వార్తలపై వెన్నెల కిషోర్ తన స్టైల్లో స్పందించాడు. ఇండియన్-2లో లేను పాకిస్తాన్-3లో లేను అంటూ బ్రహ్మనందం జిఫ్‌ను ఆడ్ చేసి ఓ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో ఇండియన్-2లో కిషోర్ లేడని స్పష్టం అయింది. ప్రస్తుతం వెన్నెల కిషోర్ చేతిలో ఆరు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.
Indian 2 lo lenu Pakistan 3 lo lenu pic.twitter.com/gJUmmoO9GG
— vennela kishore (@vennelakishore) February 28, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

