venkatesh-rana multistarrer | సినిమాల యందు మలయళ సినిమాలు వేరయ…అస్సలు ఎవ్వరూ ఊహంచని కథలతో కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు తీయడంలో మలయాళీలు దిట్ట. అసలు ఈ కథతో సినిమాలు కూడా తీయోచ్చా అనేంత సింపుల్ కాన్సెప్ట్‌తో మంచి హిట్లను సాధిస్తుంటారు. వాటిని మనవాళ్లు రిమేక్ చేసి ఇక్కడ కూడా హిట్లను సాధిస్తున్నారు. ఇక ఇప్పటికే మలయాళంలోని చాలా రిమేక్లను టాలీవుడ్ దర్శక నిర్మాతలు తెరకెక్కించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో మలయాళ సినిమా రిమేక్‌కు ముస్తాబవుతున్నట్లు తెలుస్తుంది.
రీసెంట్గా డిస్నీ హాట్ స్టార్‌లో విడుదలై మంచి వ్యూవర్షిప్ ను సాధించిన సినిమా బ్రో డాడి. మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సకుమారణ్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఇందులో నటించిన పృథ్వీరాజ్ సుకుమారణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే వీళ్ల కాంబోలో వచ్చిన లూసిఫర్ మంచి విజయం సాధించగా..ఇక్కడ చిరంజీవి గాఢ్‌ఫాదర్ టైటిల్‌తో రిమేక్ చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన బ్రో డాడి చిత్రాన్ని తెలుగులో వెంకటేష్- రానాలతో కలిసి తెరకెక్కించాలని సురేష్ బాబు భావిస్తున్నాడట. ఇక ఇప్పటికే మానాడు సినిమా హక్కులను సొంతం చేసుకున్న సురేష్ బాబు బ్రోడాడి సినిమా హక్కుల కోసం కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తుంది…