Venkatesh | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) కలయికలో భారీ ఎంటర్టైనర్ రానుందనే వార్తతో టాలీవుడ్ అభిమానుల్లో జోష్ మొదలైంది. ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి తెరపై కనిపించబోతున్న చిత్రం “మన శంకర వర ప్రసాద్ గారు”. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం తెలుగు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా కూడా మారింది. ఈ చిత్రానికి హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, పాజిటివ్ ఎనర్జీతో నిండిన కథలను చెప్పడంలో దిట్ట అయిన ఆయన, ఈసారి చిరంజీవి – వెంకటేష్‌ల కలయికను మరింత స్పెషల్‌గా మలచబోతున్నారని సమాచారం.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, వెంకటేష్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే అది సాధారణ పాత్ర కాదు. ఆయన పాత్రలో వినోదంతో పాటు కథను కీలక మలుపు తిప్పే ఎమోషనల్ ఎడ్జ్ కూడా ఉంటుందట. ఆయన ఎంట్రీ తర్వాత సినిమా నరేషన్ మరింత ఉత్సాహంగా మారుతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించిన కొన్ని సన్నివేశాలు ఇప్పటికే షూట్ పూర్తయ్యాయి. వాటిలో ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఆ పాట సినిమాకు హైలైట్‌గా నిలవనుందని టీమ్ విశ్వాసం. మెగాస్టార్ మాస్ అటిట్యూడ్, వెంకటేష్ కూల్ కామెడీ, అనిల్ రావిపూడి ప్రత్యేక నేరేషన్ స్టైల్ కలగలిపి ఈ సినిమా పూర్తి ప్యాకేజీ ఎంటర్టైనర్గా రానుందని తెలుస్తోంది.
చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని భారీ సెట్స్‌లో వేగంగా జరుగుతోంది. అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునేలా భావోద్వేగాలు, కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ మేళవింపుతో స్క్రిప్ట్ రూపొందించబడిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం టాలీవుడ్లో అత్యంత పెద్ద మల్టీస్టారర్‌గా నిలవనుంది. అభిమానుల అంచనాల ప్రకారం, “మన శంకర వర ప్రసాద్ గారు” వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాకి పోటీగా పలు చిత్రాలు విడుదల అవుతున్నా, అందరి దృష్టి ఈ మూవీపైనే ఉంది.