Venkatesh Daggubati | తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ వెంకటేశ్. తన కెరీర్లో చాలా రీమేక్ సినిమాల్లో నటించాడు వెంకీ. వాటిలో చాలావరకు సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ క్రమంలో 2021లోనూ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు వెంకీ. ఈ రెండు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో ఇప్పుడు మరో రెండు రీమేక్ సినిమాల వైపు వెంకటేశ్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు వెంకటేశ్. వరుణ్ తేజ్ ఇందులో మరో హీరోగా నటిస్తున్నాడు. ఫిబ్రవరి 25న సినిమా విడుదల కానుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ తెలుగు రీమేక్‌లో వెంకటేశ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రీమేక్ హక్కులు రామ్ చరణ్ దక్కించుకున్నాడు. ముందుగా డ్రైవింగ్ లైసెన్స్ సినిమా పవన్ కళ్యాణ్, రవితేజ హీరోలుగా రీమేక్ చేయాలని రామ్ చరణ్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. అయితే అది కుదిరేలా కనిపించడం లేదు. పైగా ఈ సినిమా హక్కులు ఇప్పుడు రామ్‌చరణ్ చేతుల్లోంచి గీతా ఆర్ట్స్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.
డ్రైవింగ్ లైసెన్స్ సినిమాను వెంకటేశ్ హీరోగా రీమేక్ చేస్తే బాగుంటుందని అల్లు అరవింద్ ఆలోచిస్తున్నాడు. ఇందులో మరో హీరో కోసం వేట మొదలైంది. ముందుగా రవితేజను అనుకున్న ఇప్పుడు ఆయన స్థానంలో మరో యువ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది. రీమేక్ సినిమాలతో స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఒక దర్శకుడు ఈ సినిమా బాధ్యత తీసుకోబోతున్నాడు. త్వరలోనే డ్రైవింగ్ లైసెన్స్ తెలుగు రీమేక్ గురించి అధికారిక ప్రకటన బయటకు రానుంది. ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలు తెలుగులో ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్లో చిరంజీవి నటిస్తుండగా.. అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమా రీమేక్ భీమ్లా నాయక్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది రెండు రీమేక్ సినిమాలతో వచ్చిన వెంకీ.. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tollywood | కొంతమంది హీరోలకు సొంత పేర్లు అసలు కలిసి రావు.. ఇదుగో సాక్ష్యం
Venkatesh: మరో రీమేక్‌పై కన్నేసిన వెంకటేష్..!
Venkatesh Daggubati | రూటు మార్చుకుంటున్న వెంకటేశ్.. అలాంటి సినిమాలకే ఓకే
‘నారప్ప’ కొడుకు శీనప్ప రోల్ చేసింది ఎవరో తెలుసా…?
శ్రీవిష్ణు ఆ సినిమాను 72 సార్లు చూశాడట