Veerasimhareddy | బాలకృష్ణ వీరసింహారెడ్డి షూటింగ్ ఫైనల్ అప్డేట్
ఇప్పటికే విడుదల చేసిన వీరసింహారెడ్డి (veerasimhareddy) ఫస్ట్ హంట్ టీజర్‌తోపాటు జై బాలయ్య సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. వీరసింహారెడ్డి షూటింగ్‌కు సంబంధించి ఫైనల్ అప్డేట్ వచ్చింది.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం వీరసింహారెడ్డి (veerasimhareddy). స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి ఫైనల్ అప్డేట్ వచ్చింది. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయినట్టు తాజా సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫుల్ స్పీడుమీదున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ హంట్ టీజర్‌తోపాటు జై బాలయ్య సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది.
వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యేర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. క్రాక్ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని కాంపౌండ్ నుంచి వస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
కన్నడ యాక్టర్ ధునియా విజయ్ విలన్‌గా నటిస్తుండగా..కేజీఎఫ్ అవినాష్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ రాయలసీమలో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో వస్తోంది. అఖండ సినిమాకు గూస్ బంప్స్ తెప్పించే మ్యూజిక్ అందించిన ఎస్ థమన్ మరోసారి థియేటర్లను షేక్ చేయబోతున్నట్టు జై బాలయ్య సాంగ్‌తో తెలిసిపోతుంది.
Read Also : Waltair Veerayya | చిరంజీవి వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ ఫైనల్.. పోస్టర్ వైరల్
Read Also : Gayathrie Shankar | విక్రమ్ నటి గాయత్రి శంకర్‌కు అరుదైన అవార్డు
Read Also : SSMB28 | ముంబైలో డిన్నర్.. దుబాయ్‌కు ఎస్ఎస్ఎంబీ 28 టీం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

