సుర సుర చూపుల రాకుమారి
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమాలోని రెండో పాట ‘సుగుణ సుందరి’ లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు. థమన్ స్వరపరచిన ఈ పాటను రామ్ మిరియాల, స్నిగ్ధ ఆలపించారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్నందించారు.
ఇస్తాంబుల్‌లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ పాట హుషారెత్తించే మాస్ బీట్తో ఆకట్టుకుంటున్నది. ‘సుగుణా సుందరి..సుర సుర చూపుల రాకుమారి..పెళ్లిగంట కొట్టినాదే అత్తింటికి రా మరి..’ అనే లైన్స్ మాస్‌ను మెప్పించేలా ఉన్నాయి. పవర్ఫుల్ యాక్షన్, ఎమోషన్స్ కలబోసిన చిత్రమిదని, బాలకృష్ణ పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది.
శృతిహాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, చంద్రిక రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రిషి పంజాబీ, సంగీతం: తమన్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, సీఈఓ: చెర్రీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

