రామ్‌కార్తీక్, కశ్వి జంటగా నటిస్తున్న చిత్రం ‘వీక్షణం’. మనోజ్ పల్లేటి దర్శకుడు. పి.పద్మనాభరెడ్డి, అశోక్‌రెడ్డి నిర్మాతలు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. చిత్ర యూనిట్‌కి భరద్వాజ్ శుభాకాంక్షలు అందించారు. పక్కోడి జీవితంలోకి తొంగి చూస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలిపే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. అందరికీ గుర్తింపు తెచ్చే సినిమా ఇదని హీరో రామ్‌కార్తీక్ నమ్మకంగా చెప్పారు. ఇంకా చిత్రయూనిట్ మొత్తం మాట్లాడారు.