Ghani Anthem Song | గూస్బంప్స్ తెప్పిస్తున్న గని ఆంథెమ్ సాంగ్..లిరికల్ వీడియో
టాలీవుడ్ (Tollywood) యువ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తోన్న తాజా చిత్రం గని (Ghani). ఈ చిత్రం నుంచి దే కాల్ హిమ్ గని ఆంథెమ్ సాంగ్ (Ghani Anthem Song)ను మేకర్స్ విడుదల చేశారు.

టాలీవుడ్ (Tollywood) యువ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తోన్న తాజా చిత్రం గని (Ghani). కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా బాక్సింగ్ నేపథ్యంలో వస్తోంది. బాలీవుడ్ బ్యూటీ, దబాంగ్ 3 ఫేం సయీ మంజ్రేకర్ (Saiee Manjrekar) హీరోయిన్గా నటిస్తోంది. నీ జగజగడం వదలకు రా కడవరకూ..ఈ కథనగుణం అవసరమే ప్రతి కళకు నిన్నేంటి మొన్నేంటి నీకెందుకు ఇవాళే నీకు మైదానం…దే కాల్ హిమ్ గని అంటూ వరుణ్ తేజ్ బాక్సింగ్ ప్రాక్టీస్ సెషన్ తో సాగుతున్న గని అంథెమ్ సాంగ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ఆదిత్య అయ్యంగార్, శ్రీ కృష్ణ, సాయి చరణ్, పృథ్వి చంద్ర పాడారు. ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. తాజాగా విడుదలైన పాటతో వరుణ్ తేజ్ గని పాత్ర కోసం చాలానే కష్టపడ్డారని అర్థమవుతోంది. గని చిత్రాన్ని డిసెంబర్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
ఈ సినిమాలో నవీన్ చంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నదియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్ పై అల్లు బాబీ, సిద్ధు ముద్ద గని చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Samantha art | సమంత పెయింటింగ్ ఆర్ట్ వీడియో వైరల్
RX100 Remake Trailer | ఆర్ఎక్స్ 100 రీమేక్ ట్రైలర్ అదిరింది..వీడియో
Neha Sharma | సెట్స్ లో విచిత్రంగా ప్రవర్తించారు..అప్పుడే తెలిసింది
Manchi Rojulochaie Title Song| సరదాగా ‘మంచి రోజులొచ్చాయి’ టైటిల్ సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

