హీరో వరుణ్‌తేజ్ తాజా చిత్రం ‘బరి’ సినిమా ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా వరుణ్‌తేజ్ వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి తీవ్రగాయమైంది. దాంతో ఆయనకు శస్త్రచికిత్సను నిర్వహించారు. ఈ విషయాన్ని ఆయన సోదరి, చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల తన సోషల్‌మీడియా ద్వారా తెలియజేశారు. ‘వాలీబాల్ గేమ్ ప్రాక్టీస్ సందర్భంగా అన్నయ్య గాయపడ్డారు.
ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం అన్నయ్య డాక్టర్ల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలో ఆయన పూర్తిగా కోలుకుంటారని భావిస్తున్నాం. ఈ సమయంలో మాకు అండగా నిలిచి ప్రేమాభిమానాలు చూపించిన వారందరికి ధన్యవాదాలు’ అని నిహారిక పేర్కొన్నారు. వరుణ్‌తేజ్‌కు శస్త్రచికిత్స కారణంగా షూటింగ్ కొన్ని వారాల పాటు వాయిదా పడనున్నట్లు తెలిసింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ‘బరి’ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.