Varun Tej | 2024 ఇయర్‌లోనూ అంతే.. బ్రేక్ కోసం వరుణ్‌తేజ్ వెయిటింగ్..!
Varun Tej | ముకుంద, కంచె సినిమాలతో టాలీవుడ్లో యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్ (Varun Tej). ఆ తర్వాత 2019లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దలకొండ గణేశ్.. 2022లో ఎఫ్ 3 తర్వాత వరుణ్ తేజ్ ఖాతాలో చెప్పుకునేంత సక్సెస్ సాధించిన సినిమాలేమి లేవు.
Varun Tej | ముకుంద, కంచె సినిమాలతో టాలీవుడ్లో యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్ (Varun Tej). ఆ తర్వాత కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా గద్దలకొండ గణేశ్, ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు దాదాపు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశపరిచాయి. 2019లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దలకొండ గణేశ్.. 2022లో ఎఫ్ 3 తర్వాత వరుణ్ తేజ్ ఖాతాలో చెప్పుకునేంత సక్సెస్ సాధించిన సినిమాలేమి లేవు.
వరుణ్ తేజ్ 2023లో యాక్షన్ థ్రిల్లర్ గాండీవధారి అర్జున సినిమాతో పలుకరించగా బోల్తా కొట్టింది.దీంతో 2023 ఇయర్ వరున్తేజ్కు ప్లాప్‌తోనే ముగిసింది. 2024 కూడా ఇదే సీన్ రిపీటైంది. ఈ ఏడాది ఎయిర్‌ఫోర్స్ డ్రామా నేపథ్యంలో నటించిన ఆపరేషన్ వాలెంటైన్ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది.
ఆ తర్వాత కరుణకుమార్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంబ్లింగ్ గ్యాంగ్ స్టర్ డ్రామా మట్కా ఊహించని స్థాయిలో డిజాస్టర్‌గా నిలిచి.. అటు మేకర్స్‌తోపాటు ఇటు అభిమానులు, మూవీ లవర్స్‌కు భారీ నిరాశనే మిగిల్చింది. ఈ లెక్కన 2024 ఇయర్ కూడా వరుణ్‌తేజ్ కెరీర్లో ప్లాప్ టాక్‌తోనే ముగిసిందని చెప్పాలి.
సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా.. ఓ వైపు ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలనే ప్రయత్నంలో ఎప్పుడూ ముందుండే వరుణ్‌తేజ్‌కు 2025 ఇయర్ అయినా కలిసి రావాలని విష్ చేస్తున్నారు మూవీ లవర్స్.
Read Also :
Pooja Hegde | పూజా హెగ్డే 2024 రౌండప్.. నో యాక్షన్.. నో రిలీజ్
Shankar | గెట్ రెడీ అంటోన్న శంకర్.. థియేటర్లలోనే కమల్‌హాసన్ ఇండియన్ 3
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

