వరుణ్‌సందేశ్ విరాజి
‘నా కెరీర్లో ఇప్పటివరకూ ఇలాంటి సినిమా చేయలేదు. మోస్ట్ క్రేజీయస్ట్ కేరక్టర్ ఇందులో చేశాను. ఈ నెల 10న విడుదల కానున్న ఫస్ట్‌లుక్ చూసి అందరూ షాక్ అవుతారు.
‘నా కెరీర్లో ఇప్పటివరకూ ఇలాంటి సినిమా చేయలేదు. మోస్ట్ క్రేజీయస్ట్ కేరక్టర్ ఇందులో చేశాను. ఈ నెల 10న విడుదల కానున్న ఫస్ట్‌లుక్ చూసి అందరూ షాక్ అవుతారు. ఈ కేరక్టర్ కోసం రెడీ కావడానికి గంట సమయం పట్టేది. ఈ సినిమాకోసం అందరిలాగే నేనూ ఎైగ్జెటెడ్గా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాతో దర్శకుడు హర్ష పెద్ద స్థాయికి వెళతాడు. పాషన్ గల నిర్మాతలు దొరకడం ఈ కథ అదృష్టం’ అన్నారు కథానాయకుడు వరుణ్‌సందేశ్.
ఆయన హీరోగా చేస్తున్న సినిమా ‘విరాజి’. ఆద్యంత్ హర్ష దర్శకుడు. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కార్యక్రమం హైదరాబాద్‌లో మంగళవారం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా వరుణ్‌సందేశ్ మాట్లాడారు. నిర్మాత మహేంద్రనాథ్, హీరో వరుణ్‌సందేశ్ లేకపోతే ఈ సినిమా లేదని, ముఖ్యంగా మహేంద్ర నిర్మాతగా మాత్రమే కాక, ఓ టెక్నీషియన్‌గా సినిమాకు పనిచేశారని, వరుణ్ కెరీర్‌కు ఇది టైలర్‌మేడ్ కేరక్టర్ అని దర్శకుడు చెప్పారు.
వరుణ్‌సందేశ్ కొత్త అవతారం ఈ సినిమా అని, పరిశ్రమలో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న తమకు అందరి సపోర్ట్ కావాలని నిర్మాత అన్నారు. ఇంకా నటి ప్రమోదిని, రఘు కారుమంచి, ఫణి, సంగీత దర్శకుడు ఎబినెజర్పాల్ తదితరులు మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

