నిత్యం వార్తలలో నిలవడం, రూపాయి ఖర్చు పెట్టకుండా సినిమాలని ఎలా ప్రమోట్ చేసుకోవాలో రామ్ గోపాల్ వర్మకు తెలిసినంత మరే దర్శకుడికి తెలియదంటే అతిశయోక్తి కాదేమో.! ట్విట్టర్ ద్వారా పలు రకాల కామెంట్స్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంటాడు. ఇటీవల ఓ అమ్మాయితో ఆడిపాడి రచ్చ చేసి ఆ వీడియో షేర్ చేసిన వర్మ రీసెంట్గా బన్నీని మెగాస్టార్ అంటూ ఆకాశానికి ఎత్తాడు.
ఇక తాజాగా తన ఫస్ట్ లవర్ అంటూ స్విమ్ సూట్ లో ఉన్న అమ్మాయి ఫొటో షేర్ చేసాడు వర్మ. ఆమె పేరు సత్య అని తెలియజేసిన వర్మ… విజయవాడ సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న సమయంలో తామిద్దరం లవర్స్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె యూఎస్‌లో మెటర్నిటీ డాక్టర్‌గా పని చేస్తుందని తెలిపారు. ఆ రోజుల్లో మెడికల్ కాలేజీ మరియు ఇంజనీరింగ్ కాలేజ్ కొన్ని కారణాల వలన ఒకే కాంపౌండ్‌లో ఉన్నాయి. ఆ సమయంలో ఆమెని ఇష్టపడ్డాను. కాని ఆమె అందంగా, డబ్బులు ఉన్న వ్యక్తి కారణంగా నన్ను పట్టించుకోలేదని భావించాను. ఈ కారణంగానే నేను రంగీలా స్టోరీ రాసుకున్నాను అని వర్మ పేర్కొన్నాడు.