Angh | టొరంటో అవార్డు గెలుచుకున్న నాగాలాండ్ చిత్రం అంగ్
Angh | నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన ఓ చిత్రం టొరంటో ప్లాట్‌ఫామ్ అవార్డు గెలుచుకుంది. అలాగే 2027 ఆస్కార్ రేసులో స్థానం దక్కించుకుంది.
Angh | తేజ రియో మొదటిసారి రూపొందించిన ఫీచర్ ఫిల్మ్ అంగ్ (Angh). నాగాలాండ్ నేపథ్యంగా ఈ సినిమాను తీశారు. తొలి సినిమాతోనే అంతర్జాతీయ అవార్డు అందుకుని శెభాష్ అనిపించుకుంటున్నారు తేజ రియో. ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) ప్లాట్‌ఫామ్ అవార్డును గెలుచుకుంది. అంతేకాదు నేరుగా 2027 ఆస్కార్ బరిలో చోటు సంపాదించుకుంది. ఈ ఏడాది ప్లాట్‌ఫామ్ విభాగానికి ఎంపికైన ఏకైక భారతీయ సినిమాగా అంగ్ నిలవడం విశేషం. అయితే ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతదేశం తరఫున ‘గోంధల్’ సినిమా ఎంపికయ్యింది. గోంధల్ చిత్ర దర్శకుడు సంతోష్ దావ్‌ఖర్ గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు. కానీ అంగ్ సినిమా నేరుగా ఆస్కార్‌లో నిలిచింది.

Angh
అంగ్ సినిమాను 1960ల నాటి నాగాలాండ్ నేపథ్యంతో తీశారు. భారత్-బర్మా సరిహద్దు సమీపంలోని మారుమూల గ్రామంలో ఈ కథ నడుస్తుంది. దీనిలో కోన్యాక్ (Konayk) తెగ నాయకుడు, చిన్నపిల్లవాడు అయిన అతని కుమారుడు చుట్టూ కథ సాగుతుంది. గ్రామంలో మొదలవుతున్న మార్పుల నేపథ్యంలో అవసరమైన వాటి కోసం విడిగా ఉండటం, ఇల్లును వదిలిపెట్టడం వంటి అంశాలపై తండ్రీకొడుకుల మధ్య సాగే భావోద్వేగం గుండెలకు హత్తుకుంటుందని డైరెక్టర్ తేజ రియో పేర్కొన్నారు. దీనిలో నాగా ఆదివాసీలనే నటులుగా తీసుకున్నామని, బాఫ్టా అవార్డు విజేత డగ్లస్ హెన్షాల్ కూడా తోడయ్యారని వెల్లడించారు. నేను పుట్టిన ప్రాంతం, నా ప్రజలు, సంస్కృతి పట్ల ఉన్న ప్రేమతోనే ఈ సినిమా తీశానని రియో అన్నారు. పురోగతి పేరుతో సంప్రదాయ జీవన విధానాలు ఎలా కనుమరుగవుతున్నాయో అంగ్ సినిమాలో చూపించామని వివరించారు.
ఈ ఏడాది ప్లాట్‌ఫామ్ విభాగంలో పన్నెండు చిత్రాలు పోటీపడ్డాయి. వాటిలో అంగ్ మాత్రమే ఏకైక భారతీయ సినిమా. ఈ సినిమాకు లభించిన అవార్డు కింద నగదు ఇరవై వేల కెనడియన్ డాలర్లు (CAD) సుమారు రూ. 13.86 లక్షలు లభించాయి. ఆస్కార్స్‌కు నేరుగా వెళ్లే మార్గాల్లో ఆరు ఫెస్టివల్ అవార్డుల్లో ప్లాట్‌ఫామ్ అవార్డు ఒకటని TIFF వర్గాలు వెల్లడించాయి. కాబట్టి అంగ్ సినిమా స్వదేశం నుంచి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదని తెలిపాయి.

Theja Rio
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

