Varanasi | సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ చిత్రం ‘వారణాసి’ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారనే వార్తలు ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉండగా, ఇటీవల సోషల్ మీడియాలో మహేష్ బాబు శ్రీరాముడి అవతారంలో ఉన్నట్లు ఓ ఫొటో వైరల్‌గా మారింది. సినిమా సెట్స్ నుంచి లీకైన అసలు ఫొటో ఇదేనంటూ నెట్టింట విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో అభిమానులు కూడా ఆ ఫొటోను నిజమేనని భావిస్తూ షేర్ చేస్తున్నారు.
అయితే వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఎలాంటి నిజం లేదు. అది సినిమా సెట్స్ నుంచి లీకైన స్టిల్ కాదు. ఆధునిక ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రూపొందించిన ఫేక్ ఇమేజ్ అని స్పష్టమైంది. ఫొటోను జాగ్రత్తగా పరిశీలిస్తే అందులోని విజువల్ లోపాలు, డిజిటల్ మార్పులు సులభంగా గుర్తించవచ్చు. గతంలో ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సెట్స్ నుంచి లీకైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మహేష్ బాబు శ్రీరాముడి గెటప్ ఫొటో మాత్రం పూర్తిగా నకిలీ అని తేలింది. కాబట్టి అభిమానులు ఇలాంటి ఫేక్ పోస్టులను నమ్మకుండా అధికారిక అప్డేట్స్ కోసం మాత్రమే ఎదురుచూడాలని సినీ వర్గాలు సూచిస్తున్నాయి.
ఇక వారణాసి సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. మహేష్ సరసన ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఆడియన్స్‌లో అంచనాలు పెంచేస్తుంది.