Vamshi Paidipally Emotional Video | సింపుల్ కథను కూడా తన స్క్రీన్‌ప్లేతో మాయ చేయగల దర్శకుడు వంశీ పైడిపల్లి. ఆయన సినిమాలోని కథలు గతంలో మనం ఎన్నో సార్లు విన్నవి, చూసినవే. కానీ తన రైటింగ్, టేకింగ్‌తో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులను రెండున్నర గంటలు సీట్లకు కట్టిపడేస్తాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ తెరకెక్కించడంలో వంశీ సిద్ధహస్తుడు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన వారసుడు విడుదలై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. జనవరి 11న తమిళంలో రిలీజైన ఈ సినిమా శనివారం తెలుగులో విడుదలైంది.
కాగా తాజాగా ఈ సినిమా చూసిన వంశీ పైడిపల్లి తండ్రి భావోద్వేగానికి గురయ్యాడు. సినిమా పూర్తవ్వగానే వంశీ తండ్రి లేచి సినిమా బాగుందంటూ వంశీ పైడిపల్లిని కౌగిలించుకుని ఎమోషనల్ అయ్యాడు. ఈ వీడియోను వంశీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ మధుర క్షణాలు ఎప్పుటికీ గుర్తుండుపోతాయని, ఇది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన, మీరు నా హీరో నాన్న అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా తమిళంలో భారీ కలెక్షన్లతో దూసుకుతుంది. తెగింపు సినిమాకు డివైడ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్లు జోరందుకున్నాయి. సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ విజయ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. తెలుగులోనూ ఈ సినిమాకు బెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రష్మిక హీరోయిన్గా నటించిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించాడు.
My Biggest achievement was today when My " Naanna / Appaa " was overwhelmed watching #Vaarasudu ( #Varisu )… This is the moment I will cherish for lifetime.. " You are my HERO Naannaa "…..Love You to Eternity… ❤️ pic.twitter.com/E5SokU8x8g
— Vamshi Paidipally (@directorvamshi) January 14, 2023