Ranga Ranga Vaibhavanga | తొలి సినిమాతోనే కలెక్షన్ల ఉప్పెన సృష్టించిన హీరో వైష్ణవ్‌తేజ్ ( Vaishnav tej ). మొదటి సినిమాకే వంద కోట్ల క్లబ్లో చేరిపోయాడు మెగా మేనల్లుడు. ఆ సినిమా సక్సెస్‌తో ఇప్పుడు వరుస ఆఫర్లు దక్కించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఈయన మూడో సినిమాను అనౌన్స్ చేశారు. గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను సోమవారం ప్రకటించారు. ఈ సినిమాకు రంగ రంగ వైభవంగా అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్‌కు జోడీగా యంగ్ హీరోయిన్ కేతిక శర్మ ( Ketika Sharma ) నటిస్తోంది.
రంగ రంగ వైభవంగా సినిమాకు సంబంధించి తాజాగా విడుదల చేసిన టీజర్ యువతను ఆకట్టుకుంటుంది. ఈ టీజర్లో.. ఏంటే ట్రీట్ ఇస్తానని చేతులు ఊపుకుంటూ వస్తున్నవ్? అని వైష్ణవ్ తేజ్ అడగ్గా.. అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏం తీసుకురావక్కర్లేదు.. నీకు బటర్ ఫ్లై కిస్ తెలుసా అంటూ కేతిక వర్మ హస్కీ వాయిస్‌లో చెబుతుంది. ఆ తర్వాత కేతికశర్మ తన కనురెప్పలతో వైష్ణవ్ తేజ్ కనురెప్పలను ముద్దాడినట్టుగా చూపించారు. ఇది నెక్ట్స్ లెవల్లో ఉందన్న వైష్ణవ్ తేజ్ డైలాగ్‌తో టీజర్ పూర్తయింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Unstoppable | చిరంజీవిని కాదని బాలయ్యతో అన్ స్టాపబుల్ చేయడానికి కారణాలేంటి?
RC15 | ఒక్క పాటకే 25 కోట్లా.. మరి సినిమా టోటల్ బడ్జెట్ ఎంత?
Bheemla Nayak | భీమ్లా నాయక్ డేట్ మళ్లీ మారిందా.. ఏకంగా చిరంజీవితోనే పోటీ..?
DSP in Pawan kalyan Movie | పవన్ కళ్యాణ్ కోసం నటుడిగా మారిన దేవి శ్రీ ప్రసాద్..?